Home
Mobile

Airtel Sim Card ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం.. కేవలం 10 నిమిషాల్లోనే సిమ్‌ కార్డు డెలివరీ..!

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను సులభంగా డెలివరీ చేసేందుకు వీలుగా ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‌ తో (Airtel Blinkit Deal) ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకే సిమ్‌ కార్డులను డెలివరీ చేయనుంది. ఎయిర్‌టెల్‌ నిర్ణయంతో అనేక మందికి ఉపయోగం కలగనుంది. ఈ నిర్ణయం టెలికాం యూజర్లకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశంలో అనేక నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

కేవలం 10 నిమిషాల్లోనే సిమ్ కార్డుల డెలివరీ :
ఎయిర్‌టెల్‌, బ్లింకిట్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ లోని 16 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా సహా అనేక ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో కేవలం 10 నిమిషాల్లోనే సిమ్‌ కార్డులను డెలివరీ చేయనున్నారు.

Airtel signs deal

ఎంత చెల్లంచాలి :
ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌ మరియు పోర్టబిలిటీ (MNP) సిమ్‌ కార్డులను తక్కువ సమయంలోనే డెలివరీ చేయనున్నారు. ఇందు కోసం రూ.49 వసూలు చేయనున్నారు. ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు. ఆధార్‌ ఆధారిత eKYC ద్వారా సిమ్‌ కార్డును యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఏయే నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి :
ప్రస్తుతం ఈ అవకాశం ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోలకతా, జైపూర్‌, హైదరాబాద్‌, గురుగ్రాం, ఫరీదాబాద్, అహ్మదాబాద్‌, సూరత్‌, భోపాల్‌, ఇండోర్‌, లక్నో వంటి నగరాల్లో ఎయిర్‌టెల్‌ బ్లింకిట్‌ ఒప్పందంలో భాగంగా కేవలం 10 నిమిషాల్లో సిమ్‌ కార్డులను పొందవచ్చు.

ఎన్ని రోజుల్లో యాక్టివేట్‌ చేసుకోవాలి :
ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డును 15 రోజుల్లోగా యాక్టివేట్‌ చేయాల్సి ఉంది. కొత్త యూజర్లు హెల్ప్‌లైన్ నంబర్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డును వినియోగిస్తున్న యూజర్లు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్ యాప్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకోవాలి.

బయోమెట్రిక్‌ ద్వారా యాక్టివేషన్‌ :
ఇప్పటికే జియో వంటి సంస్థలు కూడా వేగంగానే సిమ్ కార్డులను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ కూడా ఈ కొత్త ఒప్పందం ద్వారా వేగవంతమైన డెలివరీ అందిస్తోంది. కేంద్రం ఇటీవల తీసుకొన్న కొత్త నిర్ణయం ఆధారంగా ఆధార్‌ కార్డు ఆధారిత బయోమెట్రిక్‌ ద్వారా యాక్ట్‌వేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం :
ఇటీవలే ఎయిర్‌టెల్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ స్టార్ లింక్ ద్వారా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించనుంది. స్పేస్‌ఎక్స్‌ కు కేంద్రం ఇచ్చే అనుమతుల ఆధారంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్‌ రెండు సంస్థల ఒప్పందంలో భాగంగా.. నెట్‌వర్క్ విస్తరించేందుకు, నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు ఎయిర్‌టెల్‌కు.. స్టార్‌లింక్ సాయం చేస్తుంది. ఎయిర్‌టెల్‌ స్టోర్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందించడం, ఎయిర్‌టెల్‌ ద్వారా స్టార్‌లింక్ సేవలు.. స్కూల్స్‌, హెల్త్‌ సెంటర్‌లు, కమ్యూనిటీలకు అనుసంధానం చేసే అవకాశాలను అన్వేషిస్తుంది. మరియు ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటుంది.

Best Mobiles in India

English summary
Airtel signs deal with Blinkit to get sim card delivery in just 10 minutes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X