జియోకి ముంచుకొస్తున్న ప్రమాదం, ఆ రోజునే Airtel ఫోన్, ధర, ఫీచర్లు లీక్ !
జియోకి Airtel నుంచి ప్రమాదమే, భారీ ఫీచర్లతో Airtel నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వస్తోంది
జియోకి భారీ షాక్ ఇచ్చేందుకు Airtel రెడీ అయింది. జియో నుంచి వస్తున్న ఫీచర్ ఫోన్ కి ధీటుగా Airtel మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు లీకయ్యాయి. జియో తన ఫీచర్ ఫోన్ ని దసరాకు మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటే Airtel దీపావళికి తన ఫోన్ ని తీసుకొస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫీచర్లు కూడా జియోని తలదన్నేలా ఉండబోతున్నాయి. లీకయిన వివరాల ప్రకారం...

రాబోయ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్
Airtel నుంచి రాబోయ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అని తెలుస్తోంది. తాజా అంచనాల ప్రకారం రూ. 2,500-2,700 మధ్యలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు వేగవంతం చేసింది.

4 అంగుళాల డిస్‌ప్లే తో
4 అంగుళాల డిస్‌ప్లే తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని సమాచారం.

1 జిబి ర్యామ్
ర్యామ్ విషయానికస్తే 1 జిబి ర్యామ్ తో పాటు విస్తరణ సామర్ధ్యం ఉండేలా ఫోన్ ని మార్కెట్లోకి వదలనుంది.

డబుల్ కెమెరాలు
డబుల్ కెమెరాలు ఫోన్ కి పెద్ద అట్రాక్షన్ కానున్నాయి. డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానుంది.

భారీ బ్యాటరీ
4జీ వోల్ట్ కాలింగ్ సదుపాయంతో పాటు భారీ బ్యాటరీని ఈ ఫోన్ లో పొందుపరచనుంది. ఇవే కాక దీనికి సరికొత్త ఫీచర్లను కూడా జోడించనుంది.

ఎప్పటినుంచి బుకింగ్‌లనే విషయం..
అయితే ఎప్పటినుంచి బుకింగ్‌లను ప్రారంభించనుందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు.

జియో ఫోన్ దసరాకు
కాగా ఆగస్టు 24నుంచి జియో ఫోన్ కోసం అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన రిలయన్స్ జియో దీన్ని దసరాకు (సెప్టెంబర్‌లో) కస్టమర్లకు పలకరించనుంది.

ఆరు మిలియన్ల బుకింగ్లులు
అన్‌లిమిటెడ్‌కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో అందిస్తున్న జియో ఫోన్ కోసం 60లక్షల (ఆరు మిలియన్ల) బుకింగ్లులు నమోదైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








