Home
Mobile

ఈ నెట్‌వర్క్‌ యూజర్‌లకు రూ.5999 కే 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ ఫోన్‌.. ఇవాళే సేల్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఈ ధరల్లో ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే రూ.7000 కంటే తక్కువ ధరల్లో ఈ మధ్య కాలంలో అనేక ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. తాజాగా పోకో C71 కూడా ఇదే ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ సేవ్‌ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. కాలింగ్‌, బ్రౌజింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఫోన్‌ కొనుగోలు చేసే వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది.

పోకో C71 హ్యాండ్‌సెట్‌ రూ.7 వేల కంటే తక్కువ ధరలో (Poco C71 Smartphone Sale) ఏకంగా 6.88 అంగుళాల డిస్‌ప్లే సహా 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు బ్యాక్ ప్యానల్‌ డిజైన్‌ కూడా ఆకట్టుకుంటుంది. సేల్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ఫోన్‌ మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

poco c71 smartphone

పోకో C71 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6,499, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.7,499 కే కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ఫోన్‌ను రూ.5999 కే సొంతం చేసుకోవచ్చు. మరియు 50GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ కూల్‌ బ్లూ, పవర్‌ బ్లాక్‌, డిజర్ట్‌ గోల్డ్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

పోకో ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంది. మరియు Unisoc T7250 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందనుంది.

ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే వెట్‌ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ ఈ హ్యాండ్‌సెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు ఈ ఫోన్‌ బ్యాక్ ప్యానల్‌ స్ల్పిట్ గ్లిడ్‌ డిజైన్‌తో కూడిన డ్యూయల్‌ టోన్ ఫినిష్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ను ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని జరగకుండా ఉండేందుకు వీలుగా ఈ డిస్‌ప్లే అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ఫ్లిక్కర్ ఫ్రీ, Low Blue light, సర్కాడియన్‌ వంటి TUV Rheinland eye ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 32MP ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ పోకో ఫోన్‌ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, , డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, బ్లూటూత్‌, GPS, FM రేడియో, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
airtel users can get poco c71 smartphone at rs5999 price in first sale in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X