రెడ్మీ నోట్ 4 ఫోన్‌లకు Airtel VoLTE సపోర్ట్

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన షియోమీ Redmi Note 4 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకుంది. తాజాగా లభించిన MIUI 8 stable అప్‌డేట్‌తో Airtel VoLTE సపోర్ట్ రెడ్మీ నోట్ 4 ఫోన్‌లలో యాడ్ అవుతోంది. ప్రస్తుతానికైతే ఈ VoLTE టెక్నాలజీ పనిచేయదు. అయితే, రానున్న రోజుల్లో మాత్రం భారతీ ఎయిర్‌టెల్ యూజర్లు తమ రెడ్మీ నోట్ 4 ఫోన్‌లలో VoLTE సపోర్ట్‌ను పొందే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతిత్వరలోనే ఈ రోల్‌అవుట్ ఉంటుందీ

ఎయిర్‌టెల్ ఇప్పటికే తన VoLTE సర్వీసును వివిధ స్మార్ట్‌ఫోన్‌లలో విజయవంతంగా పరీక్షించి చూసినట్లు సమాచారం. ఎయిర్‌టెల్ వోల్ట్ సర్వీసు ఏప్రిల్ చివరినాటికే అఫీషియల్‌గా లాంచ్ కావల్సి ఉన్నప్పటికి అది జరగలేదు. అయితే అతిత్వరలోనే ఈ రోల్‌అవుట్ ఉంటుందని సమాచారం.

అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 4G VoLTE ఫీచర్‌...

ప్రస్తుత ట్రెండ్‌ను అంచనా వేసినట్లయితే దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి. 4G VoLTE కమ్యూనికేషన్‌కు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో బేసిక్ ఫోన్‌లలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్, తన 4జీ యూజర్ల కోసం త్వరలో VoLTE సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

VoLTE అంటే..?

వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి.

హైడెఫినిషన్ వాయిస్ కాల్స్...

VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel VoLTE Support Now Rolling Out to Xiaomi Redmi Note 4 via MIUI 8 Stable Update. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting