భారతీయ మార్కెట్లోకి ఎయిర్ టైమ్ 3జీ మొబైల్స్ ఫ్లాంట్, టోరిడ్

Posted By: Staff

భారతీయ మార్కెట్లోకి ఎయిర్ టైమ్ 3జీ మొబైల్స్ ఫ్లాంట్, టోరిడ్

గరిష్ట సెల్ ఫోన్ల అమ్మకాలతో భారత్ 2014 చివరికల్లా ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్న నేపధ్యంలో, భారతీయ సెల్ ఫోన్ వాడకం దారులను ఆకట్టకుకోవటంతో పాటు, మార్కెట్లో తమ ఉనికిని చాటుకునేందుకు పలు కంపెనీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కోనుగోలు సామర్ధ్యం అధికంగా ఉండటంతో సెల్ ఫోన్ల మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయుల్లా విరజిల్లుతుంది. మానవుని దైనందిన కార్యకలాపాల్లో నిత్యావసరంలా మారిన సెల్ ఫోన్లు పోటీ వ్యాపారం నేపధ్యంలో చౌక ధరలకే లభ్యమవుతున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేంకు అత్యాధునిక ఆప్షన్లతో కూడిన మొబైల్ ఫోన్లు రూ.1500 నుంచి రూ.5000 ధరల మధ్య అందుబాటులో ఉన్నాయి.

వినియోగాదారులు కోరుకునే మన్నికను దృష్టిలో ఉంచుకుంటున్న ప్రస్తుత సెల్ ఫోన్ కంపెనీలు రీజనబుల్ ధరకు నాణ్యమైన వస్తువులను ప్రవేశపెట్టే పనిలో పడ్డాయి. కోనుగోలుదారుడు ఆశిస్తున్న అన్ని అంశాలను ఫాలో అవుతున్న ఎయిర్ టైమ్ కమ్యూనికేషన్స్ సంస్థ తమ సోంత బ్రాండ్ తో రూపుదిద్దుకున్న రెండు మొబైల్ హ్యాండ్ సెట్ లను మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసంది. మోటరోలా ఎక్స్ టీ 800, హెచ్ టీ సీ పల్స్ సీడీఎమ్ఏ వంటి బ్రాండ్ లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ సంస్థ తాజాగా తన సొంత ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

తక్కువ ధర.. అత్యాధినిక ఆప్షన్లు.. మన్నిక వంటి నేపధ్యాలతో విడుదలైన ఫ్లాంట్ , టారీడ్ ఫోన్లు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి మరింత ఆకర్షించతగినవిగా రూపొందించారు. ఈ 3జీ ఇంటెర్నట్ సౌలభ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలచే ఈ ఫోన్ల ధర రూ.6000 ఉండోచ్చట..? ఈ ఫోన్లలో ఇమిడి ఉన్న ప్రత్యేక అంశాలను పరిశీలిస్తే 3.2 అంగుళాల విస్తీర్ణం కలిగిన టచ్ స్ర్కీన్ డిస్ ప్లే
కలిగి ఉన్న ఫ్లాంట్ మొబైల్ స్లైడింగ్ కీప్యాడ్ కలిగి ఉంటుంది. ఫ్లాష్ తో కూడిన 3 పిక్సల్స్ శక్తివంతమైన కెమెరా ఈ ఫోన్ కు మరో ఆకర్షణ, 7 ఎమ్ బీ పీ ఎస్ ల డేటా వేగంతో 3జీ ఇంటర్నెట్ ఈ ఫోన్లలో లభ్యమవుతుంది. బ్లూటూత్, మ్యూజిక్ ప్లేయర్, 4జీబీ ఎక్సటర్నల్ సపోర్ట్ లు అదనం.

2.8 అంగుశాల విస్తీర్ణం కలిగి టచ్ స్ర్కీన్ డిస్ ప్లేతో రూపుదిద్దుంకుంటున్న టారీడ్ మొబైల్ ను స్లైడింగ్ క్వర్టీ కీ ప్యాడ్ తో రూపొందించారు. ఫ్లాంట్ తో పోలిస్తే కాస్త చిన్న డిస్ ప్లే కలిగి ఉన్న టారీడ్ లో ఫ్లాంట్ లో ఉన్న అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఈ మొబైల్ ధర ఫ్లాంట్ కాన్న కాస్త తక్కవుట..? సామన్య మధ్యతరగతి కోనుగోలు సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మొబైల్
ఫోన్లను ఎయిర్ టైమ్ మార్కెట్లో అతి త్వరలో విడుదల చేయునుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot