ఎయిర్ టైమ్ నుండి తక్కువ ధరకే 3జీ ఫోన్

Posted By: Super

ఎయిర్ టైమ్ నుండి తక్కువ ధరకే 3జీ ఫోన్

గత పది సంవత్సరాలుగా ఇండియన్ మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ రోజుల్లో కేవలం నాలుగు లేక ఐదు మొబైల్ కంపెనీలు మాత్రమే మొబైల్స్‌ని విక్రయించడం జరిగేది. కానీ ఇప్పడు పరిస్దితి మారింది. ఇప్పుడు ఇండియాలోనే మైక్రోమ్యాక్స్, మ్యాక్స్, కార్బన్ మొబైల్స్, స్పైస్ లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటి సేల్స్ విదేశీ కంపెనీలైన నోకియా, శ్యామ్ సంగ్, ఎల్ జీ లాంటి కంపెనీలకు ఏమాత్రం తగ్గకుండా పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే అమెరికా ఆధారిత ఎయిర్ టైమ్ టెలికమ్యూనికేషన్స్ అనే కంపెనీ ఇండియాలో త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తాపత్రయపడుతుంది.

ఇక ఎయిర్ టైమ్ విషయానికి వస్తే చాలా కంపెనీలకు వైర్ లెస్ సోల్యూషన్స్ ప్రోవైడర్ అయినటువంటి ఎయిర్ టైమ్ సొంతంగా తనయొక్క మొబైల్ ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో మార్కెటింగ్ చేయాలని ఆశిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న యూత్ ఎక్కువగా ఎకానమీ, స్టయిలిస్ట్‌గా ఉండే మొబైల్స్ పై ప్రత్యేకమైన శ్రధ్దని చూపిస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోని ఎయిర్ టైమ్ కంపెనీ 3జి మొబైల్ డివైజ్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ మొబైల్ పేరు ఎయిర్ టైమ్ జిటి‌ఎక్స్ 75 టొర్రిడ్.

ఎయిర్ టైమ్ జిటి‌ఎక్స్ 75 టొర్రిడ్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం 2.8 టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, స్లైడింగ్ తో పాటుగా ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. ఈ కీప్యాడ్ వల్ల యూజర్స్ మెసేజ్‌లను చాలా సాప్ట్‌గా టైప్ చేసుకోవచ్చు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న సొసైటీకి ఈ మొబైల్ చాలా బాగా నచ్చుతుందని భావిస్తున్నారు. అందుకు కారణం లెటేస్ట్ టెక్నాలజీలతోపాటు, దీని ధర కూడా తక్కువగా ఉండడమే. ఎయిర్ టైమ్ జిటి‌ఎక్స్ 75 టొర్రిడ్‌లో ఉన్న కొన్ని ఫీచర్స్ మన డబ్బుకి వాల్యూనిస్తాయి.

ఎయిర్ టైమ్ జిటి‌ఎక్స్ 75 టొర్రిడ్ ఫీచర్స్ గనుక చూసినట్లైతే 1.3 మెగా ఫిక్సల్ కెమెరా మొబైల్ వెనుక భాగాన అమర్చడం జరిగింది. ఇందులో ఉన్న కెమెరా సహాయంతో 3జిపి ఫార్మెట్లో వీడియో కాలింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్‌కి ముందు భాగంలో ఉన్న కెమెరా సహాయంతో 3జీ నెట్ వర్క్స్ వీడియో కాలింగ్ ఫీచర్‌‌కి తోడ్పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో మల్టీమీడియా ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎఫ్ ఎమ్ రేడియోతో పాటు, 3.5mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. మొబైల్‌తో పాటు 4జిబి ఇంటర్నల్ మొమొరీగా రాగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

AirTyme GTX75 Torrid features:

3G
Stereo Bluetooth
Up To 4GB memory
Touch and Type interface
Java

ఇండియన్ యూజర్స్ కోసం ప్రత్యేకంగా రూపోందించినటువంటి ఈ ఎయిర్ టైమ్ జిటి‌ఎక్స్ 75 టొర్రిడ్ ధర కూడా ప్రజలకు అందుబాటులోనే లభించనుంది. ఇంతకీ దీని ధర ఎంత అని అనుకుంటున్నారా.. కేవలం రూ 4999 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot