ఇండియాలో ఎయిర్‌టైమ్ స్మార్ట్‌ఫోన్‌!

Posted By: Prashanth

ఇండియాలో ఎయిర్‌టైమ్ స్మార్ట్‌ఫోన్‌!

 

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ ‘ఎయిర్ టైమ్’ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ ఇదివరుకే టారిండ్, ఫ్లాంట్ పేర్లతో చవక 3జీ ఫోన్‌లను భారత విపణిలో ప్రవేశపెట్టింది. ఎయిర్ టైమ్ ‘పికాసో డీజీ50’గా పిలవబడుతున్న ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా సంస్థ సంచాలకులు గౌరవ్ నారంగ్ మాట్లాడుతూ ఆధునిక ఫీచర్లను ఒదిగి ఉన్న పికాసో డీజీ50 ఆకర్షణీయమైన డిజైనింగ్‌ను కలిగి మొబైలింగ్ అవసరాలను సమర్ధవంతంగా తీరుస్తుందని తెలిపారు.

ఫోన్ కీలక ఫీచర్లు:

3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

512ఎంబీ ర్యామ్,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

బ్లూటూత్,

3జీ కనెక్టువిటీ,

మైక్రో ఎస్‌డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ధర రూ.6,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot