Home
Mobile

ఆకట్టుకునే ఫీచర్లతో Alcatel 3V, బడ్జెట్ ధరకే సొంతం చేసుకోండి

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా కంపెనీలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath Aiah

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనా కంపెనీలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షియోమి వివో, లెనోవా లాంటి కంపెనీలు బడ్జెట్ ధరల్లో తమ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ వరసలో ఇప్పుడు ఆల్కాటెల్ కూడా చేరింది. అల్కాటెల్ 3వి' పేరుతో అద్భుత ఫీచర్లతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ని అందుబాటులోకి తెచ్చింది. రూ.9,999 ధ‌ర‌లో ఈ నెల 31వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్ర‌త్యేకంగా ల‌భ్యం కానుంది. అలాగే పలు ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.

అల్కాటెల్ 3వి ఫీచ‌ర్లు

అల్కాటెల్ 3వి ఫీచ‌ర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 16+5 ఎంపీ డ్యుయ‌ల్ రియర్‌ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఫోన్‌పై రూ.2200 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. అలాగే మింత్రా, క్లియ‌ర్ ట్రిప్ లకు చెందిన రూ.1వేయి, రూ.500 గిఫ్ట్ ఓచ‌ర్ల‌ను అందిస్తారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ స‌దుపాయాల‌ను ఈ ఫోన్‌పై అందివ్వ‌నున్నారు.

అల్కాటెల్ 3వి స్మార్ట్‌ఫోన్‌లో..

అల్కాటెల్ 3వి స్మార్ట్‌ఫోన్‌లో..

అల్కాటెల్ 3వి స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ వెనుక భాగంలో 12, 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమ‌ర్చారు. ముందు భాగంలో ఉన్న 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ తోపాటు, ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని క‌ల్పించారు.

ప్రీమియం బ్రాండ్‌లో ..

ప్రీమియం బ్రాండ్‌లో ..

ప్రీమియం బ్రాండ్‌లో కసమర్లు ఆశించే ఫేస్ అన్‌లాక్‌ సహా అన్ని ఫీచర్లతో తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేశామని భారత్‌లో అల్కాటెల్ పరికరాలను విక్రయిస్తున్న చైనాకు చెందిన టిసిఎల్ కమ్యూనికేషన్ రీజనల్‌ డైరెక్టర్‌ ప్రవీణ్ వలేచా తెలిపారు.

Best Mobiles in India

English summary
Alcatel 3V With 6-Inch FHD+ 18:9 Display And Dual Rear Cameras Launched For Rs 9,999 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X