ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Alcatel, ఫ్లాష్ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రంట్, బ్యాక్ యూనిట్లు డ్యుయల్ కెమెరా సెటప్‌తో

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరా యూనిట్లు డ్యుయల్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటాయి. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థలు ఉంటాయి.

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్..

RGB ఇంకా monochrome లెన్సులతో వస్తోన్న ఈ డ్యుయల్ సెటల్ కెమెరాల ద్వారా మొబైల్ ఫోటోగ్రఫీలో కొత్త ఒరవడినే సృష్టించవచ్చు. ఇక వీడియోలు విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లోని కెమెరాల ద్వారా 4కే, 2కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

Alcatel Flash టెక్నికల్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ విత్ ఓలియోఫోబిక్ కోటింగ్, ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం, డెకా కోర్ హీలియో X20 MT6797 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Alcatel Flash టెక్నికల్ స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫింగర్ ప్రింట్ స్కానర్, 3,100mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్ 4,1, యూఎస్బీ టైప్ - సీ, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరో మీటర్, హాల్ స్విచ్, ఫోన్ బరువు 155 గ్రాములు, ధరకు సంబంధించిన వివరాలు వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Alcatel Flash Launched With Front and Rear Dual Camera Setups. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot