ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్: ఆల్కాటెల్ ఐడోల్ ఎక్స్ ప్లస్

|
ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్: ఆల్కాటెల్ ఐడోల్ ఎక్స్ ప్లస్

భారతదేశపు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల కాలంలో మోటరోలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకంగా విక్రయిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఖ్యాతిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే పంధాను కొనసాగిస్తూ టీసీఎల్ కమ్యూనికేషన్స్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఆల్కాటెల్, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఐడోల్ ఎక్స్ +'(Idol X Plus)ను ఇండియన్ మార్కెట్ల విక్రయించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. మోటరోలా మోటో జీ, మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే ఈ ఆల్కాటెల్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మే29 నుంచి ప్రత్యేకంగా విక్రయించనుంది.

 

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించినట్లయితే... ముందుగా ఐడోల్ ఎక్స్+ స్మార్ట్‌ఫోన్‌ను డెసెంబర్ 2013లో చైనాలో ఆవిష్కరించారు. ఆ తరువాత జనవరిలో నిర్వహించిన సీఈఎస్ 2014 టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఇండియన్ మార్కెట్లో మే 29నుంచి ఈ ఫోన్‌లను బ్లూయిష్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఆల్కాటెల్ ఐడోల్ ఎక్స్+ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్: ఆల్కాటెల్ ఐడోల్ ఎక్స్ ప్లస్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 140.4×69.1×7.9మిల్లీ మీటర్లు, బరువు 125 గ్రాములు. ఫోన్ ధర రూ.18,858. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి తెలుగు గిజ్‌బాట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X