Home
Mobile

Alcatel మళ్లీ భారత్‌కు వచ్చేస్తోంది.. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో మార్కెట్ షేక్!

Alcatel India launch: టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఫ్రెంచ్ టెక్ బ్రాండ్ అల్కాటెల్ మళ్లీ ఇండియాలో సందడి చేయబోతోంది. TCL కమ్యూనికేషన్స్ అనే సంస్థ నోకియా లైసెన్సుతో దీన్ని నడుపుతోంది. ఈసారి మాత్రం 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో వస్తోంది. అంటే ఇకపై అల్కాటెల్ ఫోన్లు అన్నీ మనదేశంలోనే తయారవుతాయి.

నిజానికి అల్కాటెల్‌కి ఇండియా కొత్త కాదు. 90ల్లోనే కార్డ్‌లెస్ ఫోన్లతో ఇక్కడ మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి తరం వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత నోకియా, అల్కాటెల్-లూసెంట్ కంపెనీలు కలిసిపోవడంతో ఇండియా నుంచి వెళ్లిపోయింది. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వస్తోంది.

Alcatel India Comeback Made in India Affordable Smartphones Launching Soon

* స్టైలస్ ఫోన్‌తో గ్రాండ్ ఎంట్రీ.. ఫీచర్లు అదిరిపోలా..

ఈసారి అల్కాటెల్ ఊరికే రాలేదు.. స్టైలస్‌ ఫీచర్‌తో ఒక స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. స్టైలస్ అంటే పెన్ లాంటిది.. ఫోన్ స్క్రీన్‌పై రాసుకోవడానికి, గీసుకోవడానికి పనికొస్తుంది. ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉద్యోగం చేసే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ధర ఎంత అనేది మాత్రం సీక్రెట్‌గా ఉంచారు.

కానీ మార్కెట్‌లో ఆల్రెడీ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, ఇన్ఫినిక్స్ నోట్ 5 Stylus లాంటి స్టైలస్ ఫోన్లు ఉన్నాయి. వాటితో పోటీ పడటానికి అల్కాటెల్ రెడీ అవుతోంది. అందరికీ అందుబాటు ధరల్లోనే అదిరిపోయే ఫీచర్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది అని టాక్.

* బడ్జెట్ ఫోన్లతో ఊచకోత.. లిస్టు చూస్తే షాక్

ఫ్లిప్‌కార్ట్‌లో అల్కాటెల్ ఫోన్లు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే లాంచ్ ఉండొచ్చనిపిస్తోంది. పైగా బడ్జెట్ ధరల్లో కనీసం నాలుగు మోడల్స్‌తో రాబోతోందని సమాచారం. వాటి పేర్లు ఏంటంటే అల్కాటెల్ Idol 4, అల్కాటెల్ U5 HD, అల్కాటెల్ 3X, అల్కాటెల్ Onetouch Flash 6042D. ఇవి కొత్త మోడల్సేం కాదు.

కానీ.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇండియాలో రిలీజ్ కాలేదు. వీటితో పాటు కొత్త మోడల్స్ కూడా లాంచ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అలాగే అల్కాటెల్ వెబ్‌సైట్‌లో అల్కాటెల్ 1B (2022), అల్కాటెల్ 1L Pro, అల్కాటెల్ 1S (2021) మోడల్స్ కూడా ఉన్నాయి. వీటి సంగతి మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

* టాబ్లెట్స్ కూడా వస్తాయా..

స్మార్ట్‌ఫోన్లతో పాటు టాబ్లెట్స్ కూడా లాంచ్ చేసే ఆలోచనలో అల్కాటెల్ ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ట్యాబ్‌, TKEE, అల్కాటెల్ 3 సిరీస్ వంటి టాబ్లెట్లు రావచ్చు. అయితే దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఫోన్లు కొన్నాక సర్వీస్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. దేశమంతా సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది అల్కాటెల్.

*:పోటీ మామూలుగా ఉండదు..

2025లో ఇండియాలోకి వస్తున్న రెండో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అల్కాటెల్. ఇంతకుముందు ఏసర్ కూడా మార్చి 25న లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది కానీ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు. ఏది ఏమైనా.. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంటేనే పోటీ ప్రపంచం. ఒక్కో బ్రాండ్ ఒక్కో రేంజ్‌లో ఫోన్లతో రెడీగా ఉంది. కానీ అల్కాటెల్‌కి ఉన్న అనుభవం, టెక్నాలజీతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది.

మొత్తానికి అల్కాటెల్ మళ్లీ ఇండియాపై ఫోకస్ పెట్టిందని అర్థమవుతోంది. లోకల్‌గా ఫోన్లు తయారుచేయడం వల్ల తక్కువ ధరలు, కొత్త ఫీచర్లు, మంచి సర్వీస్.. ఇవన్నీ కలిపి ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. త్వరలోనే లాంచ్ గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

Best Mobiles in India

English summary
Alcatel re-enters India with Made-in-India smartphones, launching a stylus phone and budget models via Flipkart. Explore Alcatel’s premium smartphones, service network, and market expansion in 2025.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X