ఎంటర్ అయితే స్వర్గం చూపిస్తుంది!!

Posted By: Super

ఎంటర్ అయితే స్వర్గం చూపిస్తుంది!!

 

ఒక్క టచ్‌తో నేరుగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించే హ్యాండ్‌సెట్‌ను ఆల్కాటెల్ డిజైన్ చేసింది. ఈ సరికొత్త టచ్ బార్ స్మార్ట్‌ఫోన్ పేరు వన్‌టచ్ వోటీ 985ఎన్. ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. అంతేకాదు శక్తివంతమైన 659మెగాహెడ్జ్ మీడియాటెక్  MT6573 సెంట్రల్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేశారు. ఈ ఫోన్ ద్వారా యూజర్లు ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి సలువుగా ప్రవేశించవచ్చు. నిక్షిప్తం చేసిన బ్లూటూత్, జీ-సెన్సార్ వ్యవస్థలు వేగవంతమైన పనితీరును కలిగి ఉంటాయి. ఫోన్ మెమెరీ 32జీబి వరకు పెంచుకోవచ్చు. ఫోన్ ధర ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

క్రీయాశీలక ఫీచర్లు:

3.5అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్  MT6573 ప్రాసెసర్, 3.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 256 ఎంబీ ర్యామ్, 512ఎంబీ రోమ్, 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఆర్ఎస్,  యూఎస్బీ కనెక్టువిటీ ఆండ్రాయిడ్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), హై క్వాలిటీ ఆడియో ప్లేయర్ మరియు వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot