అధికారికంగా ఆ వివరాలు బయటకు పొక్కాయి..?

Posted By: Prashanth

అధికారికంగా ఆ వివరాలు బయటకు పొక్కాయి..?

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఆల్కాటెల్’ తాజాగా డిజైన్ చేసన్న ‘వన్ టచ్ OT-909s’ క్లాసికల్ స్మార్ట్ ఫోన్ వివరాలు బహిర్గతమయ్యాయి. బ్రాండ్ అధికారిక వర్గాలు సంబంధిత వివరాలను వెలవరించాయి. క్లాసికల్ టచ్ తో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజ్ సగుటు మొబైల్ వినియోగదారుడు కోరుకుంటున్న అవసరాలను సమృద్థిగా తీర్చుతుందని రివ్యూలు ఆశావాహం వ్యక్తం చేస్తున్నాయి.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టం,

* 600 MHz ప్రాసెసింగ్ వ్యవస్థ,

* క్వాల్కమ్ MSM 7227 చిప్ సెట్,

* క్వర్టీ కీ ప్యాడ్,

* 256 ఎంబీ ర్యామ్,

* 3జీ కనెక్టువిటీ,

* 512 ఎంబీ రోమ్,

* 1300 mAh లయోన్ బ్యాటరీ వ్యవస్థ,

పనితీరు ఇతర అంశాలు:

ఫోన్ డిస్ ప్లే పరిమాణం 2.8 అంగుళాలు, టీఎఫ్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. కనెక్టువిటీ ఫీచర్లైన బ్లూటూత్ V3.0, V2.0 మైక్రో యూఎస్బీ వ్యవస్థలు డేటాను అత్యంత వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేస్తాయి. రూపొందించిన క్వర్టీ కీబోర్డ్ సులువైన టైపింగ్ కు దోహదపడుతుంది. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ కమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. డివైజ్ లో లోడ్ చేసిన హై స్పీడ్ ‘వై-ఫై’ అదేవిధంగా ‘జీపీఎస్’ మాడ్యుల్ వ్యవస్థలు ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి. నిక్షిప్తం చేసిన యాక్సిలరోమీటర్ సెన్సార్, ఇంటిగ్రేటెడ్ ఎఫ్ఎమ్ రేడియో, 3.5 ఆడియో జాక్ అంశాలు వినోయోగదారుడికి ఉపయుక్తంగా నిలుస్తాయి. ‘ఆల్కాటెల్ వన్ టచ్ OT-909s’ మొబైల్ ధర మరియు ఇతర ఫీచర్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting