అదొక్కటే మైనస్?

Posted By: Super

అదొక్కటే మైనస్?

 

అధునాతన నిర్దేశాలతో ఆల్కాటెల్ డిజైన్ చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘వన్‌టచ్ వోటీ-985డి’.ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వీటిని బట్టి అంచనా వేస్తుంటే ఈ డివైజ్ మధ్యస్థాయి ప్రతిభను కనబరుస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘ఆల్కా‌టెల్ వన్‌టచ్ వోటీ-985డి’ ఇతర ఫీచర్లు.....

ఫోన్ బరువు 136 గ్రాములు, 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 650మెగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్, 3.1మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్, జియో ట్యాగింగ్, 256ఎంబీ ర్యామ్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, హై క్వాలిటీ వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, రిమూవబుల్ లితియమ్ ఐయాన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ముందు, వెనుక భాగాల్లో అమర్చిన కెమెరాలు అత్యుత్తమ ఫోటోగ్రఫీ ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు సహకరిస్తుంది. ఎఫ్ఎమ్ రేడియో అదేవిధంగా ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. బ్లూటూత్ కనెక్టువిటీ డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఎడ్జ్, వై-ఫై, 3జీ వ్యవస్థలు ఇంటర్నెట్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి.

అయితే, ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రాసెసర్ తక్కువ స్థాయి పనిసామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ అంశాన్ని ప్రధాన లోపంగా భావించవచ్చు. ఆల్కా‌టెల్ వన్‌టచ్ వోటీ-985డి ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot