స్పైసీ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్!!

Posted By: Staff

 స్పైసీ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్!!

 

స్మార్ట్‌ఫోన్ నిర్మాణ రంగంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్కాటెల్ తాజాగా తన వన్‌టచ్ సిరీస్ నుంచి ‘OT995 అల్ట్రా’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. ఉత్తమమైన ప్రాసెసింగ్ విలువలతో పాటు  వినోదాత్మకమైన మల్టీమీడియా అంశాలు

ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్పైసీలో లుక్‌లో కనిపించే ఈ ఫోన్ వ్యాపారానికి సంబంధించి కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది.

డివైజ్ బరువు 124 గ్రాములు. ఏర్పాటు చేసిన 4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే 480 x 800పిక్సల్ రిసల్యూషన్ వ్యవస్థను కలిగి ఉంటంది. పొందుపరిచిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్ ప్రాసెసర్, 1400మెగాహెడ్జ్ క్లాక్ వేగాన్ని కలిగి ఉత్తమమైన  మొబైల్ ప్రాసెసింగ్‌ను ఉత్పత్తి చేస్తుంది. 512ఎంబీ ర్యామ్ మొబైల్ సిస్టం మెమరీని పరిపుష్టం చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం పై హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. ఇంటర్నల్ మెమెరీ 2జీబి. మైక్రోఎస్డీ కార్ట్ సౌలభ్యతతో ఫోన్ ఎక్స్‌టర్నల్ మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్ 3.0. యూఎస్బీ వంటి డేటా షేరింగ్ అంశాలు గ్యాడ్జెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

ఏర్పాటు చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు  ఉత్తమ క్వాలిటీ వినోదానుభూతులను చేరువచేస్తాయి. లోడ్ చేసిన ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్ ఆర్‌డీఎస్ రిసీవర్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 4.92మెగా పిక్సల్ కెమెరా  2560 x1920 పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి మన్నికైన ఫోటోగ్రఫీని ఉత్పత్తి చేస్తుంది. బుల్ట్‌ఇన్ ఫ్లాష్,  1x డిజిటల్ జూమ్ ఫీచర్లు ఫోటోగ్రఫీ నాణ్యతను పెంచుతాయి. ముందుభాగంలో అమర్చిన 0.31 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది.

ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికిస్తే  ఫోన్‌లో అమర్చిన లి-యోన్ 1500 mAh బ్యాటరీ 840 నిమిషాల టాక్‌టైమ్‌తో పాటు 288 గంటలు స్టాండ్‌బై  సామర్ధ్యాన్ని కలిగి  ఉంటుంది. జీపీఎస్ ఫీచర్ సౌలభ్యతతో వివిధ ప్రదేశాలన కనుగొనవచ్చు. వ్యాపారానికి సంబంధించి కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంటో సహాయపడే  స్టాప్‌వాచ్, క్యాలుక్‌లేటర్, ఫ్లైట్ మోడ్, ఫ్యాక్స్ వంటి అప్లికేషన్‌లను వన్ టచ్ OT995 అల్ట్రాలో ప్రీలోడ్ చేశారు. ధర ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot