ఆల్కాటెల్ మరో కొత్త అద్బుత సృష్టి ఓటి 908

  By Super
  |

  ఆల్కాటెల్ మరో కొత్త అద్బుత సృష్టి ఓటి 908

   
  ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఓ సరిక్రొత్త రోల్‌ని పోషించడానికి సిద్దమైంది ఆల్కాటెల్ మొబైల్ తయారీ దారు. ఆల్కాటెల్‌ ప్రోడక్ట్ ఫోర్ట్ ఫోలియో చాలా ఎక్కవగా ఉన్నప్పటకీ ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు సరైన గ్రిప్‌ని సాధించలేదు. ఐతే రాబోయే కాలంలో ఇండియన్ మార్కెట్లోకి చాలా ప్లానింగ్‌గా అరంగేట్రం చేయాలని భావిస్తుంది ఆల్కాటెల్. ఇప్పటి వరకు ఆల్కాటెల్ విడుదల చేసినటువంటి అన్ని మోడల్స్‌లో కెల్లా వన్ టచ్ సిరిస్ ఫోన్స్ బాగా ఫేమస్. ఆల్కాటెల్ కంపెనీ నుండి విడుదలవుతున్నటువంటి వన్ టచ్ సిరిస్ మోడల్ పేరు OT 908.

  ఆల్కాటెల్ OT 908 టచ్ స్క్రీన్ మోడల్ పోన్. దీనియొక్క టచ్ స్క్రీన్ సైజు డిప్లే 2.8 ఇంచ్‌లు కలిగి ఉండి, చూడడానికి కస్టమర్స్‌ని ఇట్టే ఆకట్టుకునే విదంగా ఉంటుంది. ఆల్కాటెల్ OT 908 మొబైల్ ఫోన్ అంచులు నున్నగా రౌండ్ షేపు చేయబడి, ముందు వైపు ఉన్న ప్యానల్ బటన్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఆల్కాటెల్ OT 908 పవర్‌పుల్ 600 MHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోయోతో ఈ 600 MHz రన్ అవుతుంది. ఇది గనుక మార్కెట్లోకి విడుదలైతే కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ఎంటర్టెన్మెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో పోందుపరచబడినవి. అన్ని రకాల ఆడియో, విడియో ఫార్మెట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు వచ్చేటటువంటి ఆడియో జాక్ వల్ల బయట స్పీకర్స్‌కి కూడా కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక కెమెరా విషయానికి వస్తే కొంచెం నిరాశ కలగక మానదు. అందుకు కారణం ఇందులో ఉన్నటువంటి కెమెరా కేవలం 2మెగా ఫిక్సల్ కాబట్టి. ఐతే ిది వీడియో రికార్డింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, WLAN ఫెసిలటీ కూడా ఇందులో పోందుపరచడం జరిగింది.

  యుఎస్‌బి సింక్రనైజేషన్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 2జి ఇంటర్నెట్ యాక్సెస్ టెక్నాలజీలు అయిన EDGE, GPRS సపోర్ట్ చేస్తుంది. హై స్పీడ్ ఇంటర్నెట్‌ని 3జి నెట్ వర్క్‌ని 7Mbps స్పీడ్‌తో కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఇంటర్నెల్ మొమొరీ ఉన్నప్పటికీ కూడా మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మొమొరీని విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది.

  OT 908 specifications:

  Android 2.2 Froyo OS
  600 MHz processor
  Music and Video Player
  2G and 3G network support
  Bluetooth 3.0 with EDR
  Wi-Fi
  Stereo FM Radio
  Java

  ప్రస్తుతం దీని ధరని ఇంకా వెల్లడించలేదు. 2011 మూడవ త్రైమాసకంలో తప్పనిసరిగా ఇండియన్ మొబైల్ మార్కెట్‌ని విడుదలవుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more