‘పన్నెండు అవతరాలు’.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!!

By Super
|
Alcatel Touch new 12 models coming soon


పన్నెండు అవతారాలతో ఓ మోడల్ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థ ఆల్కాటెల్, దేశంలో ఇప్పటికే పలు మొబైల్ ఫోన్‌లను లాంఛ్ చేసింది. అమ్మకాల శాతం జోరుగా ఉన్న భారత మొబైల్ మార్కెట్లో పాగా వేసే క్రమంలో ఈ మెగా బ్రాండ్ 12 ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచియం చేసింది. వన్‌టచ్ లైనప్ నుంచి వస్తున్న ఈ ఫోన్‌లను ఇండియాలో ఐస్ మొబైల్ నెట్‌వర్క్ సిస్టమ్స్ మార్కెట్ చేస్తుంది. ఇండియాకు సంబంధించి వీటిని ఐస్ మొబైల్ నెట్‌వర్క్ సిస్టమ్స్ మార్కెట్ చేస్తుంది. ఈ సిరీస్ నుంచి అతి సమీపంలో విడుదల కాబోతున్న రెండు ఫోన్‌లకు సంబంధించి ముఖ్య వివరాలు.

ఆల్కాటెల్ ‘అల్ట్రా 995’:

* ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 4.3 అంగుళాల సమర్థవంతమైన డిస్‌ప్లే అత్యుత్తమమైన రిసల్యూషన్ కలిగి మెరుగైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది.

* 1.4 GHz వేగంతో వేగవంతమైన పనితీరును కనబరిచే శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్.

* కెమెరా సామర్ధ్యం 5 మెగా పిక్సల్స్.

* 720 పిక్సల్ మెగా రిసల్యూషన్‌తో వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

* ఇంటర్నల్ మెమెరీ 1జీబి, మైక్రో ఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా జీబిని 32కు పెంచుకోవచ్చు.

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది.

* ధర రూ.15,000.

ఆల్కాటెల్ ‘వన్ టచ్ 903’:

* ఆండ్రాయిడ్ వర్షన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 2.8 అంగుళాల ఉత్తమ క్వాలిటీ స్ర్కీన్,

* 650 MHz క్లాక్ స్పీడ్ సామర్ధ్యం గల ప్రాసెసర్,

* ధర రూ.7,500.

4.0 వోఎస్‌తో టాబ్లెట్ ప్రవేశపెట్టే యోచనలో:

ఆండ్రాయిడ్ సరికొత్త వోఎస్ ‘4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్’ పై స్పందించే టాబ్లెట్ కంప్యూటర్ ను ఆల్కాటెల్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X