ఆసియా మార్కెట్లో ఆల్కాటెల్ ఆండ్రాయిడ్ ఫోన్!!!

Posted By: Staff

ఆసియా మార్కెట్లో ఆల్కాటెల్ ఆండ్రాయిడ్ ఫోన్!!!

 

మొబైల్ ఫోన్ ఆసియా మార్కెట్లో విశ్వసనీయతను చొరగున్న ‘ఆల్కాటెల్’ బ్రాండ్‌ను పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆదరిస్తున్నారు. తాజాగా లాస్‌వేగాస్‌లో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రదర్శనలో ‘ఆల్కాటెల్’ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేసింది.

‘ఆల్కాటెల్ అల్ట్రా 995’ వేరియంట్‌లో డిజైన్ కాబడిన ఈ మధ్య స్థాయి ఫోన్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ వ్యవస్థ పై రన్ అవుతుంది. ఏర్పాటు చేసిన 4 అంగుళాల ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లే మన్నికైన రిసల్యూషన్‌తో పెద్ద తెర అనుభూతిని కలిగిస్తుంది. నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్ వేగవంతమైన పనితీరునందిస్తుంది.

పొందుపరిచిన డీఎల్ఎన్ఏ గేమింగ్ ఫీచర్ వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది. దోహదం చేసిన 3జీ కనెక్టువిటీ వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. వై-ఫై వ్యవస్థ సౌలభ్యతతో మొబైల్‌ను స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆసియా దేశాల్లో అతి త్వరలో విడుదల కాబోతున్న ‘ఆల్కాటెల్ అల్ట్రా 995’ ధర వివరాలు అతి త్వరలో వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot