Home
Mobile

భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి కొత్త బ్రాండ్ ఎంట్రీ.. అదిరిపోయే డిజైన్‌, ఫీచర్‌లతో మూడు ఫోన్‌లు లాంచ్‌..!

Alcatel V3 5G Series smartphones : ఫ్రాన్స్‌కు చెందిన అల్కాటెల్‌ సంస్థ భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అల్కాటెల్ V3 5G సిరీస్‌ పేరుతో విడుదల చేసింది. ఇందులో V3 క్లాసిక్‌ 5G, V3 ప్రో 5G, V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ మూడు ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఈ సిరీస్‌లో అల్ట్రా వేరియంట్‌ 108MP కెమెరాను కలిగి ఉంది.

* అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G :
అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ LCD 2.5D డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే మ్యాక్స్ ఇంక్‌, రెగ్యూలర్‌, ఇంక్‌ పేపర్‌, కలర్‌ పేపర్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు Low Blue Light ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Alcatel V3 5G Series smartphones launched in india

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ ఫోన్ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 4GB, 6GB LPDDR4X, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 OS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తుంది.

అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP QVGA కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. V3 క్లాసిక్ 5G స్మార్ట్‌ఫోన్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Alcatel V3 5G Series smartphones launched in india

* అల్కాటెల్‌ V3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
V3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ NXTPAPER 2.5D డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ AG యాంటీ గ్లేర్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే మ్యాక్స్ ఇంక్‌, రెగ్యూలర్‌, ఇంక్‌ పేపర్‌, కలర్‌ పేపర్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు Low Blue Light ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 OS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. V3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5010mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Alcatel V3 5G Series smartphones launched in india

* అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ :
అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్‌ HD+ NXTPAPER 2.5D డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే మ్యాక్స్ ఇంక్‌, రెగ్యూలర్‌, ఇంక్‌ పేపర్‌, కలర్‌ పేపర్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. Low Blue Light ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 6GB, 8GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 OS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తుంది.

అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5010mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ అల్ట్రా స్మా్ర్ట్‌ఫోన్‌ స్టైలస్‌ను సపోర్టు చేస్తుంది. రిటైల్‌ బాక్స్‌లో స్టైలస్‌ను కూడా సంస్థ అందిస్తోంది.

కనెక్టివిటీ పరంగా అల్కాటెల్ V3 సిరీస్‌ ఫోన్‌లు 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తాయి. మరియు బ్లూటూత్‌, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ ను కలిగి ఉన్నాయి. ఈ మూడు ఫోన్‌లు ఛార్జర్‌లతోపాటు ప్రొటెక్టివ్‌ కవర్‌లను కూడా పొందుతాయి.

అయితే V3 ప్రో మరియు V3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు భద్రత కోసం సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లను అమర్చారు. అల్ట్రా వేరియంట్‌లో మెరుగైన ఆడియో కోసం DTS X ఆధారిత డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంటుంది.

Alcatel V3 5G Series smartphones launched in india

* అల్కాటెల్‌ V3 5G సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
అల్కాటెల్‌ V3 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉంది. కాస్మిక్‌ గ్రే, హాలో వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రో మోడల్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ఈ ఫోన్‌ మెటాలిక్‌ గ్రే, మచా గ్రీన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

అదే అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21999 గా ఉంది. ఓషియల్‌ గ్రే, హైపర్‌ బ్లూ, షాంపైన్ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల సేల్ జూన్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Alcatel V3 5G Series smartphones launched in india here are the features and prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X