Home
Mobile

రేపటి నుంచే ఈ 108MP కెమెరా ఫోన్‌ సేల్‌.. 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5010mAh బ్యాటరీ సహా..!

Alcatel V3 Series Sale : భారత్‌ మార్కెట్‌లోకి ప్రాన్స్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ అల్కాటెల్ నుంచి మూడు ఫోన్లు విడుదల అయ్యాయి. అల్కాటెల్ V3 సిరీస్‌ లో భాగంగా V3 క్లాసిక్‌, V3 ప్రో, V3 అల్ట్రా మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ సేల్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ అల్కాటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు. ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు.

అల్కాటెల్‌ V3 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఆఫర్లు :
అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. యాక్సెస్‌, ఐసీఐసీఐ, SBI, HDFC బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్‌ ఉంది. ఈ ఫోన్‌ కాస్మిక్‌ గ్రే, హాలో వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Alcatel V3 series smartphone sale to start from june 2

అల్కాటెల్‌ V3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే అల్ట్రా వేరియంట్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉంది. యాక్సెస్‌, ఐసీఐసీఐ, SBI, HDFC బ్యాంకు కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ :
అల్కాటెల్‌ V3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS పైన పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 6.78 అంగుళాల ఫుల్‌ HD+ NXTPAPER 2.5D డిస్‌ప్లేతో లాంచ్ అయింది. 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5010mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. మెరుగైన ఆడియో కోసం DTS X ఆధారిత డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది.

అల్కాటెల్‌ V3 ప్రో 5G :
అల్కాటెల్‌ V3 ప్రో 5G 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ NXTPAPER 2.5D డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS పైన పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5010mAh బ్యాటరీని కలిగి ఉంది.

అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ :
అల్కాటెల్‌ V3 క్లాసిక్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ LCD 2.5D డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ క్లాసిక్‌ మోడల్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP QVGA కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Alcatel V3 series smartphone sale to start from june 2 2025 via Flipkart in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X