Home
Mobile

108MP + 32MP (సెల్ఫీ) కెమెరాలు, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లేతో Alcatel స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

భారత్‌.. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు ప్రధాన మార్కెట్‌గా ఉంది. ప్రముఖ సంస్థలు వివిధ సెగ్మెంట్స్‌లో మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోన్నాయి. తాజాగా ఫ్రెంచ్‌ మొబైల్‌ బ్రాండ్‌ అల్కాటెల్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అల్కాటెల్‌ V3 సిరీస్‌ (Alcatel V3 Series) పేరుతో ఈ ఫోన్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లో భాగంగా మూడు స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో విడుదల కానున్నాయని తెలుస్తోంది. అల్కాటెల్‌ V3 క్లాసిక్‌, V3 ప్రో, V3 అల్ట్రా మోడల్స్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్కాటెల్‌ V3 అల్ట్రా మోడల్‌ (Alcatel V3 Ultra Smartphone) వివరాలను సంస్థ టీజర్‌ ద్వారా వెల్లడించింది.

Alcatel V3 Ultra smartphone

ఎప్పుడు విడుదల కానుంది? :
అల్కాటెల్‌ V3 సిరీస్‌ భారత్‌లో మే 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. ఈ సిరీస్‌ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అల్కాటెల్‌ V3 క్లాసిక్‌, V3 ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.

సంస్థ విడుదల చేసిన టీజర్‌ ఆధారంగా అల్కాటెల్ V3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ ను కలిగి ఉంది. మరియు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్టైలస్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

అల్కాటెల్‌ V3 సిరీస్‌ అనేక డిస్‌ప్లే మోడ్స్‌ను కలిగి ఉంటుంది. రీడింగ్‌, వాచింగ్‌, స్క్రోలింగ్‌ కోసం ఉపయోగిపడుతుంది. ఈ డిస్‌ప్లే TCL NXTPAPER డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. భారత్‌లో తయారీ కోసం అల్కాటెల్‌ సంస్థ Dixon టెక్నాలజీకి చెందిన ప్యాడ్జెట్‌ ఎలక్ట్రానిక్స్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా అల్కాటెల్‌ V3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 5010mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ బెస్ట్‌ కెమెరా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

భారత్ మార్కెట్‌లో అల్కాటెల్‌ V3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ.30,000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో V3, V3 ప్రో హ్యాండ్‌సెట్‌ల గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్ ద్వారా ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

Acer తొలిసారిగా :
గత నెలలో ప్రముఖ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ల తయారీ సంస్థ Acer తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఏసర్‌ సూపర్‌ Zx సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో ఏసర్‌ సూపర్ Zx, ఏసర్ సూపర్‌ Zx ప్రో మోడల్స్‌ ఉన్నాయి. Zx వేరియంట్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ ధర రూ.9990 గా ఉంది. ఏసర్‌ సూపర్‌ ZX ప్రో వేరియంట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17990 గా ఉంది.

Best Mobiles in India

English summary
Alcatel V3 Ultra smartphone teased to launch on may 27 in india here are the expected features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X