Home
Mobile

నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 8 ఫోన్‌లకు Android Oreo

ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి.

By Sivanjaneyulu Bommu

హెచ్‌ఎండి గ్లోబల్ ఇప్పటి వరకు నాలుగు నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 8 పేర్లతో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నోకియా 3 మోడల్ ఎంట్రీ లెవల్ ఫోన్ కాగా, నోకియా 5, 6 స్మార్ట్‌ఫోన్‌లు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. మరో మోడల్ నోకియా 8ను మాత్రం హై-ఎండ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులోకి తీసుకువచ్చింది...

Android Oreo అప్‌డేట్‌..

Android Oreo అప్‌డేట్‌..

ప్రస్తుతానికి, హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసిన అన్ని నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం త్వరలోనే ఈ ఫోన్‌లు Android Oreo అప్‌డేట్‌ను అందుకోబోతున్నాయి. ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయిన నోకియా 3కి ఈ అప్‌డేట్ లభిస్తుండటం విశేషం. ఈ సమాచారాన్ని హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సార్వికాస్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు.

మార్కెట్లో  నోకియా ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే..

మార్కెట్లో నోకియా ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే..

ఇండియన్ మార్కెట్లో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే.. నోకియా 3 మోడల్ రూ.9,499 ధర ట్యాగ్ తో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో నోకియా 5 రూ.12,899 ధర ట్యాగ్ తో, నోకియా 6 రూ.14,999 ధర ట్యాగ్ తో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. నోకియా 8 రిలీజ్ కావల్సి ఉంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 8 ప్రత్యేకతలు...

నోకియా 8 ప్రత్యేకతలు...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి నోకియా 8 పూర్తిస్థాయి యునిబాడీ డిజైన్‌తో వస్తోంది. 6000 సిరీస్ అల్యూమినియమ్ బ్లాక్‌తో ఈ ఫోన్ బాడీని బిల్డ్ చేసారు. 40-స్టేజ్ ప్రాసెస్‌తో కూడిన మెచీనింగ్, అనోడైజింగ్, పాలిషింగ్ వంటి అంశాలు ఫోన్ లుక్‌ను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాయి. నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 5.3 అంగుళాల ఐపీఎస్ 2కే రిసల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఫోన్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్ పై ఫోన్ రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 3090mAh బ్యాటరీతో వస్తోంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్టును ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తు్ంది. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 5.0, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

నోకియా 8కు కెమెరా ప్రధాన హైలైట్...

నోకియా 8కు కెమెరా ప్రధాన హైలైట్...

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ఫీచర్స్ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ కెమెరాను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ సెటప్ చేసింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, పీడీఏఎఫ్, ఐఆర్ రేంజ్ ఫైండర్, f/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేయటంతో పాటు హైక్వాలిటీ వీడియో కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ సైట్ ఫీచర్ ద్వారా ఒకేసారి ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాల నుంచి ఫోటోలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది. ఈ సమయంలో ఫోన్ డిస్‌ప్లే పై split screen యాక్టివేట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
All The Android-Powered Nokia Smartphones Will be Upgraded to Android Oreo, Including the Nokia 3. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X