అది ఐఫోన్ 17 ప్రో స్మార్ట్‌ఫోనా.. ఇంకా విడుదల కాని ఫోన్ అతని చేతిలోకి ఎలా వచ్చింది..?
iPhone 17 Pro : ఐఫోన్ 17 సిరీస్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అనేక లీక్స్ ఇప్పటికే వచ్చాయి. అయితే తాజాగా ఓ X (గతంలో ట్విట్టర్) పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్ట్‌లోని వ్యక్తి రెండు ఫోన్‌లతో కనిపించారు. అందులోని ఒక ఫోన్‌ను ఐఫోన్ 17 ప్రో మోడల్‌గా భావిస్తున్నారు. ఈ ఫోన్ బ్లాక్ కలర్ కేస్‌ను కలిగి ఉంది.
ఇంకా విడుదల కాని ఐఫోన్ అతని చేతిలోకి ఎలా వచ్చిందంటూ అంతా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్ట్‌పై బ్లూమ్‌బెర్క్‌కు చెందిన మార్క్ గుర్మాన్ స్పందించారు. దీంతో @Skyfops యూజర్ చేసిన పోస్ట్‌పై అందరికి స్పష్టత వచ్చింది మరియు అందరి దృష్టిపడింది.

ఈ పోస్ట్‌లో కనిపించిన ఫోన్ మూడు కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ మరియు LiDAR స్కానర్‌ను కలిగి ఉంది. ఈ మోడల్‌ను ఐఫోన్ 17 ప్రో మోడల్‌గా భావిస్తున్నారు. మరియు MacRumors ఆధారంగా ఆ వ్యక్తి చేతిలో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16 ప్రో గా భావిస్తు్న్నారు.
ఈ ఫోన్ వెనుక భాగంలో స్టిక్కర్‌ను కూడా గుర్తించవచ్చు. ఇది ఇంటర్నెల్ టెస్టింగ్ కోసం ఆపిల్ డేటా మ్యాట్రిక్స్ కోడ్‌ను కలిగి ఉంది. దీని ఆధారంగా సదరు వ్యక్తి ఆపిల్ ఉద్యోగిగా భావిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఐఫోన్‌ల హార్డ్‌వేర్ పరీక్షిస్తున్నట్లు భావించవచ్చు.
ఐఫోన్ 17 ప్రో అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 17 ప్రో 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ A19 ప్రో చిప్‌సెట్, iOS 26 పైన పనిచేసే అవకాశం ఉంది. అప్‌గ్రేడ్ చేసిన Siri మోడల్ తో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ ప్రో మోడల్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు సెల్ఫీ కెమెరా కూడా అప్‌గ్రేడ్ తో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై ఆపిల్ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
I just spotted a test development iPhone in the wild 🤩🤩🤩 pic.twitter.com/iS3PtKWqxJ
— Fox Pupy 🦊🧡 (@Skyfops) July 28, 2025
* ఇటీవల ఐఫోన్ 17 ప్రో మోడల్స్ అనేక మెరుగైన కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. MacRumors ఆధారంగా ఈ వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ 5x జూమ్‌ను కలిగి ఉంది. అయితే ఈ సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 17 ప్రో ఏకంగా 8x ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పరంగా ఇదో పవర్‌ఫుల్ ఫీచర్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
దీంతోపాటు ప్రో మోడల్స్ ప్రత్యేకంగా ప్రో కెమెరా యాప్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా అడ్వాన్స్‌డ్ ఫోటో, వీడియో టూల్స్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రో కెమెరా యాప్ కేవలం ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌కు పరిమితం అవుతుందా లేదా ఇతర గత ఐఫోన్ సిరీస్‌లకు కూడా అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఐఫోన్ 17 ప్రో మోడల్స్ రెండో కెమెరా కంట్రోల్ బటన్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. కెమెరా సెట్టింగ్స్, ఫీచర్లకు క్విక్ యాక్సెస్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ఈ సిరీస్‌లో టాప్ ఫీచర్‌గా నిలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్‌లపై ఆపిల్ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
Photo Source : Fox Pupy


Click it and Unblock the Notifications








