స్మార్ట్‌ఫోన్‌లు: షాకింగ్ నిజాలు,బలంగా నాటుకుపోయిన అపోహలు !
స్మార్ట్‌ఫోన్‌ల గురించి రకరకాల సందేహాలు మనలో వ్యక్తమవుతూనే ఉన్నాయి.
మనలో చాలా మందికి మనం వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి అనేక రకాల రూమర్స్ ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ గురించి గురించి బలంగా నాటుకుపోయిన అపోహలు వాటిలో దాగి ఉన్నా నిజానిజాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం...
Read More : సంక్రాంతి ఆఫర్లు, 4జీ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

నాసిరకం చార్జర్లు ఫోన్ బ్యాటరీని నాశనం చేస్తాయా?
అవును, నాసిరకం చార్జర్లతో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

ఛార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్..?
ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి.

రాత్రివేళ ఫోన్ చార్జింగ్..?
మీ ఫోన్ మీ కంటే చాలా తెలివైనది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే, నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో ఓవర్ ఛార్జింగ్ కు గురై బరస్ట్ అవుతుంటాయి.

రాత్రివేళ ఫోన్‌ను ఆఫ్ చేయటం మంచిదేనా..?
అవును, మీ ఫోన్ కూడా ఓ యంత్రం లాంటిదే. దానికి ఎంతోకొంత విరామం అవసరమవుతుంది. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫర్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత
ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టడం మంచిదేనా..? ఈ ప్రక్రియ మంచిదే కానీ, క్రమం తప్పకుండా ఇలా చేయటమేనేది పలు సందర్భాల్లో కష్టమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం.

వేడి వాతావరణంలో..
అధిక వేడి బ్యాటరీ బ్యాకప్‌ను హరించి వేస్తుందా..? అవును, వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచొద్దు.

యాప్స్ కిల్ చేయటం ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడుతుందా..?
ఫోన్‌లోని యాప్స్‌ను కిల్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ పెరిగే మాట అలా ఉంచితే, ర్యామ్ మేనెజ్‌మెంట్ పై ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువుగా ఉంటుంది.

కెమెరాలోని ఎక్కువ మెగా పిక్సల్స్
కెమెరాలోని ఎక్కువ మెగా పిక్సల్స్, ఇమేజ్ క్వాలిటీ పై ఏ విధమైన ప్రభావం చూపలేవు. అయితే, అధిక మెగా పిక్సల్స్‌తో చిత్రీకరింబడిన ఫోటోలను పెద్ద సైజు షీట్‌ల పై క్లారిటీతో ప్రింట్ తీసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ సెన్సార్, అపర్చెర్ సైజ్ వంటి అంశాలు ఫోటో నాణ్యతను రెట్టింపు చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ..
ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉన్న ఫోన్, రెట్టింపు బ్యాకప్ ఇస్తుందనటంలో వాస్తవం చాలా తక్కువ. ఫోన్ ప్రాసెసర్ పనితీరుటట్టే బ్యాటరీ బ్యాకప్ ఆధారపడి ఉంటుంది.

వివిధ పరిశోధనల ద్వారా రుజువైంది ఏంటంటే..?
ఫోన్ ఆటోమెటిక్ బ్రైట్నస్, లైవ్ వాల్ పేపర్స్, బ్లూటత్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం వల్ల కేవలం 2 శాతం మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఆదా అయ్యిందట.

ఫోన్ ప్రాసెసర్ గురించి..
ఎక్కువ కోర్‌లు ఉంటే ప్రాసెసర్ పనితీరు బాగుంటుంది..? వాస్తవం: వాస్తవానికి ప్రాసెసర్ పనితీరు బాగుండాలంటే ప్రాసెసర్ ఆర్కిటెక్షర్ అలానే ప్రాసెసర్ మల్టీత్రెడింగ్ వంటి అంశాలు బాగుండాలి.

సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో..
సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంక్‌లో ప్రమాదం ఏర్పడిన సంఘటనలు ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను జారీ చేస్తుంది.

వీర్యకణాల పై ప్రభావం..
సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








