అమెజాన్ ఆపిల్ ఫెస్ట్, ఐఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆపిల్ ఫెస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆపిల్ ఫెస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిసెంబరు8న ప్రారంభమైన ఈ పండుగ ఈ నెల 14వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఇతర యాక్ససరీలపై పలు ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఐఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఐఫోన్లపై రూ.16వేల వరకు రాయితీని ఇస్తున్నారు. మాక్‌బుక్ ఎయిర్ 2018పై డిస్కౌంట్ లభిస్తున్నది. ఐప్యాడ్లు, మాక్ మినీలపై కూడా ఆఫర్లను అందిస్తున్నారు. ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

ఆపిల్ ఐఫోన్ ఎక్స్
ఐఫోన్ ఎక్స్ 3జీబీ ర్యామ్ 64 జీబీ వేరియంట్ రూ .74,999 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.91,900గా ఉంది.అలాగే 256జీబీ వేరియంట్ రూ .89,999 కు లభిస్తుంది. అసలు ధర. 1, 06,900గా ఉంది.

ఐఫోన్ 8
64జీబీ వేరియంట్ : ఈ సేల్‌లో రూ.54,999 కే లభ్యమవుతోంది కాగా దీని. అసలుధర రూ. 67,940గా ఉంది.

ఐఫోన్ 8 ప్లస్
64జీబీ వేరియంట్ ఈ ఫెస్ట్‌లో రూ. 64,999. అసలు ధర రూ.77,560గా ఉంది.

ఐఫోన్ 7 32 జీబీ :
అసలు ధర రూ. 39,900. కాగా అమెజాన్ సేల్‌లో రూ. 36,999 రూపాయలకు అందుబాటులో ఉంది.

ఐఫోన్ 7 ప్లస్
దీని అసలు ధర రూ. 62,840. 12,047 తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు దీని ధర రూ. 50,973గా ఉంది.

ఆపిల్ మాక్‌బుక్క్ ఎయిర్:
13.3 అంగుళాల 8 జనరేషన్ రూ. 1,05,900లకే లభ్యం. అసలు ధర రు. 1,14,900.

ఆపిల్ ఎయిర్ పాడ్స్ :
ఈ ఫెస్ట్‌లో వీటి ధరరూ.12,900 నుంచి 11,999 కు తగ్గింది.

ఐఫోన్ 6
32జిబి వేరియంట్ ను రూ. 10,901 డిస్కౌంట్ అనంతరం కొనుగోలుదారులు రూ.20,990కే సొంతం చేసుకోవచ్చు.

ఆపిల్ డివైస్‌లపై...
ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ వంటి ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లను, ఇతర ఆఫర్లను అందిస్తోంది. దీనికి అదనంగా అమెజాన్ వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5శాతం తక్షణ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందగలరు.
ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో రూ.16వేల వరకు తగ్గింపును అందిస్తోంది. వీటితో పాటు మరిన్ని ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత వివరాలు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు.


Click it and Unblock the Notifications








