రూ.12499 కే 128GB స్టోరేజీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP OIS కెమెరా 5G స్మార్ట్‌ఫోన్!
Samsung Galaxy M17 5G Smartphone : శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. తొలి సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ ఫోన్ రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. మరియు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి వివరాలు.
కూపన్ కోడ్ డిస్కౌంట్ :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14249, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15749 గా ఉంది. ఈ వేరియంట్స్ పై రూ.500 కూపన్ కోడ్ డిస్కౌంట్ ను అందిస్తోంది.

బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ :
ఫలితంగా ఈ ఫోన్ ను రూ.12,499, రూ.13,749, రూ.15,249 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ Sapphire బ్లాక్, మూన్‌లైట్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతుంది. 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
6 సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఫోన్ Exynos 1330 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని శాంసంగ్ హామీ ఇచ్చింది. సర్కిల్ టు సెర్చ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
50MP OIS కెమెరా :
గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. ట్యాప్ అండ్ పే ఆప్షన్ తో శాంసంగ్ వాలెట్, శాంసంగ్ Knox Vault, వాయిస్ ఫోకస్, వాయిస్ మెయిల్ వంటి ఫీచర్ లను కలిగి ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







