Home
Mobile

అమెజాన్‌ ప్రత్యేక సేల్‌.. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు.. ఆఫర్‌ కొద్ది రోజులు మాత్రమే..!

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివల్‌ సేల్ (Amazon Electronics Festival Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 10 వరకు జరుగుతుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో వన్‌ప్లస్‌ 11R, వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్‌ 11R హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో ప్రారంభ ధర రూ.39,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.28,999 కే సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్‌ 12R హ్యాండ్‌సెట్‌ రూ.2000 డిస్కౌంట్‌ ధరతో అందుబాటులో ఉంది. కూపన్‌ కోడ్‌ రూపంలో ఈ తగ్గింపును కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35998 కే సొంతం చేసుకోవచ్చు.

Amazon Electronics festival sale offer best deals on oneplus smartphones

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ (oneplus 12R Smartphone) 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌ సహా కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ (అండర్‌ ది హుడ్‌) పైన పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. OIS, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 హ్యాండ్‌సెట్‌ (OnePlus Nord 4 Smartphone) ధర రూ.29998 గా ఉంది. అయితే బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.27998 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 1240*2772 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వా్‌ల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14.1 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మరియు 50MP+ 8MP కెమెరాలను కలిగి ఉంది. 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ (Oneplus Nord CE 4 Lite Smartphone) స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత ధర రూ.19,998 గా ఉంది. ఈ అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.17,998 గా ఉంటుంది. ఈ అమెజాన్‌ సేల్‌ సెప్టెంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Amazon Electronics festival sale offer best deals on oneplus smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X