సంచలనం రేపుతున్న అమెజాన్‌ ఎక్స్ క్లూజివ్ ఫోన్

Written By:

అమెజాన్ లోకి కొత్త ఫోన్ ఎంటరయ్యింది. టినార్ కంపెనీ తన తొలి మొబైల్ ను అమెజాన్ లో అతి త్వరలో విక్రయానికి పెడుతోంది. ఈ మేరకు అమెజాన్ సైట్ లో కొనుగోలు కోసం ఎక్స్ క్లూజివ్ గా నోటీఫై అనే ఆప్సన్ ను ప్రవేశపెట్టింది. ఈ కంపెనీలో అమెజాన్ కి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. 10.or పేరుతో 2జిబి అలాగే 3జిబి ఫోన్లను వరుసగా రూ.7999, 8,999 ధరలకు అమ్మకానికి పెట్టింది. దీని ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

గంటల తరబడి మాట్లాడే దమ్ముందా..అయితే ట్రై చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 డిస్ ప్లే

5.5 డిస్ ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది.1920x1080 పిక్సల్ రిజల్యూషన్.

4000mAh బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 4000mAh బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు వస్తుంది.

2 /3 జిబి ర్యామ్

2 /3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ. మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం.

13 ఎంపీ కెమెరా

13 ఎంపీ వెనుక వెపు కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.

ఆండ్రాయిడ్ నౌగట్

స్నాప్ డ్రాగన్ 430 ఆక్టాకోర్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ నౌగట్ మీద ఈ ఫోన్ పనిచేస్తుంది. Aim Gold and Beyond Black కలర్స్ లో మీకు లభిస్తుంది.

ధర

ధర విషయానికొస్తే 2 జిబి ర్యామ్ ఫోన్ రూ.7999 గానూ, 3 జిబి ర్యామ్ ఫోన్ రూ. 8999గానూ ఉంది.

ఐడియా 4జీ డేటా ఆఫర్

దీంతో పాటు ఐడియా 4జీ డేటా ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ కొన్నవారికి 56 రోజుల పాటు 63 జిబి డేటాను అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాల్స్. యూజర్లు రూ. 343తో రీ ఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon to exclusively sell new 10.or E smartphone for Rs 7999; here are its features more News At gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot