అమెజాన్ సేల్.. 6000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాల వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్..!
OnePlus 13R Smartphone : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ లో (Amazon Great Freedom Festival 2025) భాగంగా వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 6.78 అంగుళాల డిస్‌ప్లే, రెండు 50MP కెమెరాలు, 6000mAh mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫోన్‌లకు కొలుగోలు చేయాలని భావిస్తున్న యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా ఉండే అవకాశం ఉంది.
ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
విడుదల సమయంలో వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.39,999, రూ.44,999 గా ఉన్నాయి. అంటే రూ.3 వేల తగ్గింపునకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ LTPO ( 1264 x 2780 పిక్సల్స్ ) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.0 పైన పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0 పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ తో 50MP S5KJN5 టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
6000mAh భారీ బ్యాటరీ :
ఈ వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ నెబ్యులా నోయిర్, ఆస్ట్రల్ ట్రైల్ రంగుల్లో లభిస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4 Wi-Fi 7, NFC, Navlc, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ, కలర్ టెంపరేచర్ సెన్సర్, లేజర్ ఫోకస్, కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సర్, IR రిమోట్ కంట్రోల్ సెన్సర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








