అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024.. రియల్‌మి GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 వరకు తగ్గింపు..!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 (Amazon Great Freedom Festival Sale 2024) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఇవాళ అర్ధరాత్రితో ముగుస్తుంది. అయితే ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి GT 6T హ్యాండ్‌సెట్‌ను (Realme GT 6T Smartphone Amazon Offer) భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్‌లు, కూపన్ ద్వారా ఏకంగా రూ.5000 వరకు తగ్గింపును పొందవచ్చు. పూర్తి వివరాలు.
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.30,998 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా కూపన్ ద్వారా రూ.4000 డిస్కౌంట్ వర్తిస్తుంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2780*1264 పిక్సల్ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 రక్షణకు కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 4nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 3 OS అప్‌డేట్‌లను పొందనుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32MP కెమెరాను అమర్చారు. వెనుకవైపు కెమెరాలు Prolight 2.0 అల్ట్రా సెన్సిటివ్ నైట్ సీన్ అల్గారిథమ్, స్ట్రీట్ ఫోటో మోడ్ 4.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







