అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2024 సేల్.. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2024 సేల్ (Amazon Great Indian Festival 2024 Sale) సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 24 గంటల ముందే సేల్‌లో పాల్గొనవచ్చు. అంటే సెప్టెంబర్ 26 నుంచే వారికి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా SBI డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ పే యూపీఐతో రూ.1000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే రూ.100 తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్ పై 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను (Discounts on Oneplus Smartphones) భారీ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 11R 5G, వన్‌ప్లస్ నార్డ్ CE3 5G స్మార్ట్‌ఫోన్‌లను భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లను రూ.5999 ప్రారంభ ధర నుంచే కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది.

వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus 11R Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.27,998 గా లిస్టింగ్ అయింది. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.26,749 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రస్తుత ధర రూ.17,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో రూ.16,749 కే కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13 ను కలిగి ఉంటుంది. మరియు 4nm ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు Adreno 730 GPU తో జతచేయబడింది.
కెమెరా విభాగం పరంగా 50MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 3 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13.1 ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 12GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 3.1 అంతర్గత స్టోరేజీ జరగచేయబడి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX890 కెమెరా, 8MP సోనీ IMX355, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిగి ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.16,749 కే కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








