Home
Mobile

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ 2024 సేల్‌.. ఈ iQOO స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు.. లిస్ట్‌..!

అమెజాన్ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ 2024 సేల్‌ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌లో (Amazon Great Indian Festival 2024 Sale) పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. తాజాగా ఐకూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు వెల్లడయ్యాయి. సేల్‌ డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా (iQOO Smartphones Pricedrop) ఐకూ Z9 లైట్‌, ఐకూ Z9x, ఐకూ Z9s 5G, ఐకూ Z9s pro 5G, ఐకూ నియో 9 ప్రో, ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌ సహా షియోమీ వంటి అనేక బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

amazon great indian festival 2024 sale iqoo smartphone deals revealed here is the list

ఐకూ Z9 లైట్‌ : ఈ హ్యాండ్‌సెట్‌ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.10499 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.

ఐకూ Z9x 5G : ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.72 అంగుళాల డిస్‌ప్లే ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14ను కలిగి ఉంది.

amazon great indian festival 2024 sale iqoo smartphone deals revealed here is the list

44W ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకేష్‌ కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ సాధారణ ధర రూ.12499 కాగా.. సేల్‌లో భాగంగా రూ.10,749 కే సొంతం చేసుకోవచ్చు.

ఐకూ Z9s 5G : ఈ స్మార్‌ఫోన్‌ 6.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను అమర్చారు. మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు. అదే ఐకూ Z9s ప్రో మోడల్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2024 సేల్‌లో భాగంగా నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్స్చేంజీ బోనస్‌ పేరుతో రూ.1500 తగ్గింపును పొందవచ్చు.

ఐకూ నియో 9 ప్రో : ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది 50MP ప్రైమరీ కెమెరా + 8MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. వీటితోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌ సేల్‌లో రూ.31,999 కే కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon great indian festival 2024 sale offers massive discounts on iqoo smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X