అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. రూ.8999 ధరకే లేటెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్..!
Amazon Great Indian Festival 2025 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌లను పొందవచ్చు. అయితే అమెజాన్ సేల్ కోసం అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు డిస్కౌంట్‌ల వివరాలను వెల్లడించాయి. తాజాగా ఐకూ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ల వివరాలు వెల్లడయ్యాయి.
భారత్ మార్కెట్‌లో ఐకూ నుంచి ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఐకూ Z10 సిరీస్‌లో భాగంగా అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. అయితే అమెజాన్ సేల్‌లో భాగంగా ఐకూ Z10 మోడల్‌ను రూ.18,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ :
అదే ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ను రూ.17,499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.77 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 4K అల్ట్రా క్లియర్ వీడియో ఫీచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS), 2MP సెకండరీ కెమెరా, 32MP కెమెరాను కలిగి ఉంది. 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్ :
ఐకూ Z10x మోడల్‌ను రూ.11999 కే అందుబాటులో ఉంటుంది. 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. 50MP అల్ట్రా HD కెమెరా, 2MP బోకేష్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
💥 Unbeatable Prices. Unstoppable Power.
— iQOO India (@IqooInd) September 17, 2025
The Amazon Great Indian Festival is here, and so are the Kickstarter Deals on iQOO smartphones! 🚀
Get your hands on the iQOO Z10R at just ₹17,499* and the iQOO Neo10R at just ₹23,999* with No Cost EMI (3 & 6 months).
Don’t miss out –… pic.twitter.com/5IKKQaFpx2
ఐకూ Z10 లైట్ స్మార్ట్‌ఫోన్ :
ఐకూ Z10 లైట్ వేరియంట్‌ను రూ.8999 కే కొనుగోలు చేయవచ్చని ఐకూ చెబుతోంది. 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 50MP సోనీ AI కెమెరా, 2MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఐకూ నియో మోడల్స్ :
రూ.20 వేల కంటే ఎక్కువ ధర కలిగిన మోడల్స్ పైనా డిస్కౌంట్‌లను అందించనుంది. ఐకూ నియో 10R 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.23,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే ఐకూ నియో 10 ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉండనుంది.
ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ , వద్ద కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంకు కార్డులపై మాత్రమే ఈ ధరలను పొందవచ్చని ఐకూ చెబుతోంది. ఈ సేల్‌లో భాగంగా 3, 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌లను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications