Home
Mobile

బెస్ట్‌ ఆఫర్‌.. రూ.11998 కే 6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మా్ర్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఐకూ Z10 సిరీస్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇందులో ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.15 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, 50MP కెమెరా, అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే డిస్కౌంట్‌ :
అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్ 2025 ఇవాళ్టి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్ (iQOO Z10x 5G Smartphone) తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మరియు కూపన్‌ కోడ్‌ ద్వారా మరింత అదనపు తగ్గింపును పొందవచ్చు.

Amazon Great indian Festival 2025

ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16,499 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు.

రూ.11,998 కే 5G స్మార్ట్‌ఫోన్‌ :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ 6GB/128GB వేరియంట్ ధర రూ.12998 గా ఉంది. కూపన్‌ కోడ్‌తో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.11,998 కే కొనుగోలు చేయవచ్చు. 8GB/128, 8GB/256GB వేరియంట్స్‌పై రూ.1250 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.13,748, రూ.14,748 ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Amazon Great indian Festival 2025

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
ఈ ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది. ఫలితంగా చిన్న చిన్న డ్యామేజీలను తట్టుకొనే అవకాశం ఉంటుంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ అల్ట్రా మెరైన్‌, టైటానియం వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ తెలిపింది.

అల్ట్రా HD కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP అల్ట్రా HD ఆటోఫోకస్‌ ప్రైమరీ కెమెరా, 2MP బోకేష్‌ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌ను కూడా అమర్చారు. ఈ ఫోన్‌ AI Erase, AI Document, AI ట్రాన్స్‌లేషన్ వంటి ఎడిటింగ్‌ టూల్స్‌ను కలిగి ఉంది.

6500mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6 ఫీచర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ఉంటుంది. IR బ్లాస్టర్‌నూ అందిస్తున్నారు. డ్యూయల్‌ స్పీకర్‌లున్నాయి.

Best Mobiles in India

English summary
Amazon Great indian Festival 2025 Now Available at Rs11998 on iQOO Z10x 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X