Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ 5G ఫోన్‌పై రూ.3500 తగ్గింపు..!

భారత్‌లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. ఫలితంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఈ ధర సెగ్మెంట్‌లో వివిధ మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా రియల్‌మి ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో రియల్‌మి నార్జో 80 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో నార్జో 80x, నార్జో 80 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌లో ప్రో మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

విడుదల సమయంలో రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 80 Pro 5G Smartphone) 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23499 గా ఉంది. అమెజాన్ డిస్కౌంట్ ధరతోపాటు కూపన్ కోడ్‌ ద్వారా భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

realme narzo 80 Pro 5G smartphone pricedrop

మొత్తంగా రూ.3500 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో 8GB/128GB ధర రూ.17,498 గా ఉంది. అంటే రూ.2500 తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు రూ.1000 కూపన్‌ కోడ్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. మొత్తంగా రూ.3500 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా రూ.16498 కే సొంతం చేసుకోవచ్చు.

అదే 8GB/256GB ధర రూ.19498 గా ఉంది. అంటే రూ.2 వేల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీంతోపాటు కూపన్‌ కోడ్ ద్వారా రూ.500 తగ్గింపును పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.2500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.18498 కే సొంతం చేసుకోవచ్చు.

12GB/256GB ధర ప్రస్తుతం రూ.21498 గా ఉంది. అంటే రూ.2 వేల తగ్గింపునకు లభిస్తోంది. దీంతోపాటు కూపన్‌ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధర రూ.20498 గా ఉంటుంది.

realme narzo 80 Pro 5G smartphone pricedrop

రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 6050mm Sq VC కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

6000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 80W SuperVOOC ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

50MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ రియల్‌మి నార్జో 80 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ రేసింగ్‌ గ్రీన్‌, స్పీడ్‌ సిల్వర్‌, నిట్రో ఆరెంజ్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

Best Mobiles in India

English summary
Amazon great indian Festival 2025 Offers Rs3500 pricecut on realme narzo 80 Pro 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X