రూ.10998 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ 5G స్మార్ట్‌ఫోన్!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ (Amazon Great Indian Festival 2025 Sale) ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్ లో భాగంగా అనేక స్మార్ట్ ఫోన్ లు డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతోపాటు SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నార్జో 80 సిరీస్ సేల్‌లో భాగంగా ఈ సంవత్సరం తొలిభాగంలో ఈ ఫోన్ విడుదల అయింది.
తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ (Realme Narzo 80x 5G Smartphone) కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ ఓ ఆప్షన్ గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీ, IP69 రేటింగ్. 128GB స్టోరేజీ వంటి అనేక ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి.

ధర, సేల్ వివరాలు :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ సేల్ లో ఈ ఫోన్ ధరలు రూ.11998, రూ.12998 గా ఉన్నాయి.
రూ.10988 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
అంటే రూ.2000 డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు కూపన్ కోడ్ ద్వారా రూ.1000 అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. దీంతో నార్జో 80x 5G స్మార్ట్ ఫోన్ ను రూ.10998, రూ.11998 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సన్‌లిట్ గోల్డ్, డీప్ ఓషియన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది.

మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ :
రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.72 అంగుళాల ఫుల్ HD+ ఫ్లా్ట్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. దీంతోపాటు IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు.
6000mAh భారీ బ్యాటరీ :
నార్జో 80x 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








