అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్: ఫోన్ కొనడానికి ఇదే సరైన సమయమా? లేక ఆఫర్ల కోసం ఆగాలా?
సెప్టెంబర్ 26వ తేదీ వచ్చేసింది.. భారతదేశంలో పండగ సీజన్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ హడావుడి అప్పుడే మొదలైపోయింది. అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ (GIF) సేల్ అక్టోబర్ 8న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ (BBD) అక్టోబర్ 9న మొదలుకానుంది. అయితే, సేల్స్ ఆఫిషియల్‌గా ప్రారంభం కాకముందే టీజర్ డీల్స్‌తో ఆన్‌లైన్ షాపర్లు కార్ట్‌లను నింపేస్తున్నారు. ఆఫర్ల వేటలో గంటగంటకూ బెస్ట్ సెలర్ ర్యాంకులు మారిపోతున్నాయి. మరి ఈ సమయంలో బ్రాండ్ల ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పుడే ఫోన్ కొనేయాలా లేదా కొన్ని రోజులు ఆగాలా? పూర్తి వివరాలు చూద్దాం.
రూ.10,000 లోపు బడ్జెట్‌లో శామ్‌సంగ్, రెడ్‌మీ, వివో, రియల్‌మీ, మోటోరోలా బ్రాండ్లు బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. ఇక రూ.10,000 నుంచి రూ.20,000 రేంజ్‌లో ఐకూ (iQOO), రెడ్‌మీ, శామ్‌సంగ్ కంపెనీలు ఫ్లాష్ కూపన్లతో సేల్స్ పెంచుకుంటున్నాయి. రూ.20,000 నుంచి రూ.40,000 సెగ్మెంట్‌లో వన్‌ప్లస్, ఐకూ, శామ్‌సంగ్‌లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. అదే రూ.40,000 కంటే ఎక్కువ బడ్జెట్ చూస్తే.. పాత ఐఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపులు రావడంతో ఆపిల్ హవా నడుస్తోంది.

అమెజాన్ GIF vs ఫ్లిప్‌కార్ట్ BBD: నేటి బ్రాండ్ల సేల్స్ రేస్
సేల్‌లో బెస్ట్ డీల్స్ పట్టుకోవడానికి ప్రైస్ ఫిల్టర్లు, 5G ఆప్షన్‌ను ఉపయోగిస్తూ.. గంటగంటకూ బెస్ట్ సెలర్ లిస్ట్‌ను చెక్ చేస్తూ ఉండండి. కేవలం హడావుడి చూసి మోసపోకుండా యూజర్ రేటింగ్స్ కూడా ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ముఖ్యంగా లంచ్ టైమ్, రాత్రి 8 గంటల ఫ్లాష్ సేల్స్ సమయంలో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఫేవరెట్ కలర్స్, 128 GB లేదా 256 GB స్టోరేజ్ వేరియంట్లు త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మోడల్స్ సడన్‌గా అమ్ముడుపోతే పోటీ బ్రాండ్లు పైకి వచ్చేస్తాయి.
అమెజాన్ GIF vs ఫ్లిప్‌కార్ట్ BBD: బ్యాంక్ ఆఫర్లు, EMI, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు
ఈ పండగ సేల్స్‌లో నిజమైన లాభం బ్యాంక్ ఆఫర్లతోనే సాధ్యమవుతుంది. అమెజాన్ తమ కస్టమర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డ్స్‌పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం ఆఫర్ ప్రకటిస్తోంది. అయితే ఒక్కో కార్డ్‌పై డిస్కౌంట్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మీ కార్డ్ లిమిట్ పూర్తయితే, సెప్టెంబర్ 27 వరకు ఆగితే మళ్లీ ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది.
అమెజాన్ GIF vs ఫ్లిప్‌కార్ట్ BBD: వేర్వేరు బడ్జెట్లలో డిమాండ్ ట్రెండ్స్
రూ.10,000 లోపు బడ్జెట్ ఫోన్లు కొనేవారు మంచి కూపన్ డిస్కౌంట్ కనిపించగానే ఆలస్యం చేయకుండా కొనేయడం మంచిది, ఎందుకంటే ఇవి త్వరగా అయిపోతాయి. రూ.10,000 నుంచి రూ.20,000 బడ్జెట్‌లో 5G ఫోన్లు వెతికే స్టూడెంట్స్, గేమర్స్ ఫ్లాష్ ఆఫర్స్ కోసం ఆగడం మేలు. ఇక రూ.20,000 నుంచి రూ.40,000 మధ్య కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేవారు ఎక్స్ఛేంజ్ బోనస్, నో-కాస్ట్ EMI కాంబినేషన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రీమియం ఐఫోన్ల కోసం చూసేవారు ప్రధాన సేల్ తేదీల వరకు ఆగితే మంచి బండిల్ ఆఫర్లు పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు మాత్రం బ్యాంక్ ఆఫర్లే కీలకం.
సెప్టెంబర్ 26ని ప్రధాన సేల్‌కి ముందు ఒక ట్రయల్ రన్ లాంటిదిగా అనుకోవచ్చు. ఒకవేళ కూపన్, బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అన్నీ కలిసి బెస్ట్ డీల్ కనిపిస్తే ఇప్పుడే ఫోన్ బుక్ చేసుకోండి. లేదంటే సెప్టెంబర్ 27-28 మిడ్‌నైట్ ఆఫర్లు లేదా అక్టోబర్ 8-9 తేదీల్లో ప్రారంభమయ్యే మెయిన్ సేల్ వరకు వేచి చూడటం ఉత్తమం. ఆఫీషియల్ సేల్ షురూ కాగానే ధరలు, ఆఫర్లలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
