జనవరి 20న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల చివరలో గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను అందించేందుకు రెడీ అయింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల చివరలో గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లను అందించేందుకు రెడీ అయింది. జనవరి 20 నుంచి 23వ తేదీల్లో ఈ సేల్ నిర్వహించనుంది. హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ గాడ్జెట్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు, రోజువారీగా వాడే ఉత్పత్తులు, టీవీలు, బుక్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపులను అందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా పలు రకాల స్మార్ట్ ఫోన్లపై తగ్గింపులను అందించింది. అ ఫోన్ల వివరాలను తన సైట్ లో ఉంచింది. మరి తగ్గింపు పొందనున్న స్మార్ట్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

వన్‌ప్లస్ 6టి
అమెజాన్ లో ఈ ఫోన్ 6GB RAM+128GB internal storage ధర రూ. 37,999, 8GB RAM+128GB internal storage ధర రూ. 41,999, 8GB RAM+256GB internal storage ధర రూ. 45,999గా ఉంది.

Xiaomi Redmi Y2
3GB RAM+32GB మొబైల్ ఇప్పుడు రూ,8,999కే లభ్యమవుతోంది. 4GB RAM+64GB వేరియంట్ 10,999కి లభిస్తోంది. Grey, Gold and Rose Gold ఇలా మూడు రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

Realme U1
3GB RAM+32GB internal storage వేరియంట్ ఇప్పుడు రూ. 11,999కి, 4GB+64GB వేరియంట్ రూ.14,99 ధరలో లభిస్తోంది.

ఇతర ఫోన్లు
హానర్ 8ఎక్స్, ఐఫోన్ X, రెడ్‌మీ వై2, హువావే నోవా 3ఐ, వివో వై9 ప్రొ ఫోన్లపై డిస్కౌంట్లను అందివ్వనున్నారు. ఈ సేల్‌లో హార్డ్ డిస్కులు, హెడ్‌ఫోన్లు, గేమింగ్ యాక్ససరీలపై 60 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తారు.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో
ఎలక్ట్రానిక్స్‌పై 60 శాతం వరకు తగ్గింపును అందివ్వనున్నారు. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ సదుపాయాలను కూడా ఇవ్వనున్నారు. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నారు.

ఇతర పరికరాలు
అలాగే ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల భారీ డిస్కౌంట్, కెమెరాలపై రూ.5వేల డిస్కౌంట్, యాక్టివిటీ ట్రాకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, లార్జ్ స్క్రీన్ ఎల్ఈడీ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. వీటితోపాటు ప్రింటర్లు, స్పీకర్లు, ట్యాబ్లెట్ పీసీలపై 40 శాతం, సౌండ్ బార్స్‌పై 30 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications








