రూ.12999 ధరకు 50MP OIS కెమెరా, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ 5G ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ గత సంవత్సరం అనేక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లను లాంచ్ చేసింది. A, M, F సిరీస్ లో అనేక మోడల్స్ ను తీసుకొచ్చింది. గత సంవత్సరం విడుదల అయిన శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ ( Samsung Galaxy M17 5G Smartphone ) ప్రస్తుతం రూ.13 వేల ధర రేంజ్ లో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో ( Amazon Great Republic Day Sale 2026 ) భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్ లపై డిస్కౌంట్ లను అందిస్తోంది. ఈ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.15,499 గా ఉంది.

దీంతోపాటు SBI క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ Sapphire బ్లాక్, మూన్ లైట్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.5mm థిక్‌నెస్ ను కలిగి ఉంది.
అమెజాన్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను పొందుతోంది. IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ Exynos 1330 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని శాంసంగ్ తెలిపింది.
50MP కెమెరా OIS :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది.
శాంసంగ్ వాలెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్, ట్యాప్ అండ్ పే ఫీచర్ తో శాంసంగ్ వాలెట్, Knox Vault, వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications







