Home
Mobile

108MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, AMOLED డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌!

Amazon Great Republic Day Sale 2026 : భారత్ మార్కెట్‌ లో షియోమీ సంస్థ ఈ నెలలో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026 లో భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌, 108MP కెమెరాను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది.

రూ.2000 డిస్కౌంట్‌ :
రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 15 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Redmi note 15 5G smartphone features

కలర్‌ వేరియంట్స్ :
రెడ్‌మి నోట్‌ 15 5G ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, గ్లేసియర్‌ బ్లూ, మిస్ట్‌ పర్పుల్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ రెడ్‌మి హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీ తో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

Redmi note 15 5G smartphone features

108MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
ఇతర స్పెసిఫికేషన్‌లతోపాటు ఈ ఫోన్ కెమెరా విభాగం కూడా ఆకట్టుకొనే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు ఉన్న కెమెరాలతో 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌, సెల్ఫీ కెమెరా 30fps వద్ద 1080p రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

రివర్స్‌ ఛార్జింగ్‌ :
ఈ రెడ్‌మి ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 18W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో సపోర్టుతో 5520mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.1, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Republic Day sale 2026 Offers Rs2000 discount on Redmi note 15 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X