ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అమెజాన్‌లో డిస్కౌంట్ ఆఫర్..!
Amazon Great Republic Day Sale 2026 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. SBI బ్యాంకు క్రెడిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ను అందించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్, ఇయర్‌బడ్స్ సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. అయితే అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ వివరాలు వెల్లడయ్యాయి.
అమెజాన్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 మోడల్‌ను (iPhone 15 Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.59900 గా ఉండగా.. జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.50249 ధరకు సొంతం చేసుకోవచ్చు.

రూ.9651 డిస్కౌంట్! :
అయితే బ్యాంకు కార్డులపైనే ఈ ధరను పొందవచ్చు. సుమారుగా రూ.9651 డిస్కౌంట్‌ను పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతోపాటు ఎక్స్ఛేంజీ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్ పనితీరు ఆధారంగా ఎక్స్ఛేంజీ ధర ను నిర్ణయిస్తారు.
స్పెసిఫికేషన్‌లు :
ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంది. సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్ A16 బయోనిక్ చిప్‌పైన పనిచేస్తోంది. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌తోపాటు వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ 15R, ఐకూ 15, ఐకూ నియో 10 5G, ఐకూ Z10R 5G, శాంసంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ M17 5G సహా రియల్‌మి, లావా స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను వెల్లడించే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M17 5G :
అమెజాన్ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Exynos 1330 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ శాంసంగ్ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 5MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో లెన్స్‌లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13MP కెమెరాలు ఉన్నాయి.
ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్ Knox Vault, వాయిస్ మెయిల్, వాయిస్ ఫోకస్, ట్యాప్ అండ్ పే సపోర్టుతో శాంసంగ్ వాలెట్‌ను కలిగి ఉంది. సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications







