ధర రూ.9499 కే 6000mAh, 128GB స్టోరేజీ శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ మరో రెండు రోజులు మాత్రమే..!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 ( Amazon Great Summer Sale 2024 ) పేరుతో ప్రత్యేక సేల్ జరుగుతోంది. ఈ సేల్ మే 2న ప్రారంభం కాగా.. 7వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M14 5G హ్యాండ్ సెట్‌ను (Samsung Galaxy M14 5G Price Drop) విడుదల ధరతో పోలిస్తే భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత అమెజాన్ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు. 6GB ర్యా్‌మ్ + 128GB స్టోరేజీ ధర రూ.9,999 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G స్పెసిఫికేషన్లు : ఈ శాంసంగ్ హ్యాండ్ సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పుల్ HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2408 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ముందువైపు వాటార్ డ్రాప్ నాచ్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్‌లు :
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.0 పైన పనిచేస్తుంది. దీంతోపాటు ఆక్టాకోర్ Exynos 1330 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ Mail-G68 MP2 GPUతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ అప్ డేట్‌లు, నాలుగు సెక్యూరిటీ అప్ డేట్లు పొందుతుంది.
6000mAh బ్యాటరీ :
శాంసంగ్ గెలాక్సీ M14 5G హ్యాండ్ సెట్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 6GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటి పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టుతో రానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications