Home
Mobile

Amazon Sale : 5500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌ వన్‌ప్లస్‌ ఫోన్‌పై రూ.1650 డిస్కౌంట్..!

Amazon Great summer Sale 2025 : అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ ప్రస్తుతం జరుగుతోంది. మే 1 వ తేదీ నుంచి ఈ సేల్‌ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC క్రెడిట్‌ కార్డుతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా గత సంవత్సరం లాంచ్ అయిన వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 4 Lite 5G Smartphone) గత సంవత్సరంలో విడుదల అయింది. ఈ ఫోన్‌ లాంచ్‌ సమయంలో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.22,999 గా ఉంది.

Oneplus Nord CE 4 Lite 5G Smartphone

మొత్తంగా రూ.1650 తగ్గింపు! :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.17998 గా ఉంది. అదే మరో వేరియంట్‌ రూ.20998 ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 128GB స్టోరేజీ వేరియంట్‌పై రూ.400 కూపన్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు HDFC బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై గరిష్ఠంగా రూ.1250 తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా రూ.1650 వరకు తగ్గింపును పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ (1080*2400 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2100 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 20:9 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌, అల్ట్రా ఆరెంజ్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 695 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 619 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB LPDDR4X, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 తో పనిచేస్తోంది.

3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ వన్‌ప్లస్‌ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ Supervooc ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.1, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Amazon Great summer Sale 2025 Offers best deal on Oneplus Nord CE 4 Lite 5G Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X