Home
Mobile

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025.. ఈ iQOO స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు..!

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ (Amazon Great Summer Sale 2025) మే 1 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లు, ఇతర గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఐకూ 13, ఐకూ 12, ఐకూ నియో 10R, ఐకూ Z10, ఐకూ Z10x, ఐకూ Z9s, ఐకూ Z9 లైట్, ఐకూ Z9x వంటి ఐకూ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ :
ఐకూ లేటెస్ట్‌ ఫ్లాప్‌షిప్‌ ఫోన్‌ ఐకూ 13 (iQOO 13) ఉంది. ప్రస్తుజం జరుగుతున్న అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.51999 గా ఉంది. ఈ ఫోన్‌ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ Q2 ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది.

Amazon great summer sale 2025 offers best deals on these iQOO smartphones

ఈ ఫోన్‌ 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 50MP సోనీ IMX921 (OIS + EIS) ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 50MP అల్ట్రావైడ్‌ శాంసంగ్ JN1 కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యం, 50MP సోనీ IMX816 కెమెరాను అమర్చారు. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ (iQOO 12) 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.42999 గా ఉంది. 6.78 అంగుళాల క్వాడ్‌ HD LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది.

ఈ ఫోన్ 50MP OmniVision OV50H (OIS) కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 64MP పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ ఫోన్‌ 120W ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఐకూ నియో 10R :
అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఐకూ నియో 10R ఫోన్‌ను (iQOO Neo 10R) రూ.24999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మాప్‌డ్రాగన్ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా ఉండేలా వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

ఈ ఐకూ ఫోన్‌ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాలను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది. AI Erase, Ultra Clear వంటి అనేక AI ఫీచర్లున్నాయి.

ఐకూ Z10 :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను (iQOO Z10) బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 90W ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. భారీ బ్యాటరీని కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్‌ కేవలం 7.89 అంగుళాల థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. మరియు 199 గ్రాముల బరువు ఉంటుంది.

ఈ ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

ఈ ఐకూ హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX882 ప్రైమరీ (OIS) కెమెరా, 2MP సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాలను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ గా ఉంది. AI Erase, AI సూపర్ డాక్యుమెంట్, AI సర్కిల్‌ టూ సెర్చ్, AI నోట్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

ఐకూ Z10x 5G :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z10x 5G) అన్ని బ్యాంకు ఆఫర్‌లతో కలిపి రూ.13249 కే సొంతం చేసుకోవచ్చు. 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP అల్ట్రా HD కెమెరా, 2MP బోకేష్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP కెమెరాను అమర్చారు. AI ట్రాన్స్‌లేషన్, AI Erase, AI డాక్యుమెంట్‌ ఫీచర్‌లున్నాయి.

ఐకూ Z9s స్మార్ట్‌ఫోన్‌ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP సోనీ IMX882 OIS కెమెరాను కలిగి ఉంది. మరియు మీడియాకెట్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐకూ Z9 లైట్‌ ఫోన్‌ను రూ.9499 కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP సోనీ AI కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది.

ఐకూ Z9x స్మార్ట్‌ఫోన్‌ను రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు 120Hz అడాప్టివ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great summer sale 2025 offers best deals on these iQOO smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X