Amazon సేల్ మొదలైంది, ఆఫర్లు ఇవే
అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ సేల్ శుక్రవారం ప్రారంభమైంది. జనవరి 22 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
2017కుగాను మొదటి అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ సేల్ శుక్రవారం ప్రారంభమైంది. జనవరి 22 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

డబ్బులు సంపాదించుకునేందుకు యూట్యూబ్‌లో కొత్త ఫీచర్
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీస్ అలానే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పై అమెజార్ భారీ ఆఫర్లతో పాటు రాయితీలను గుప్పిస్తోంది. ఇదే సమయంలో తమ ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగానికి వచ్చేసరికి మోటో జీ4 ప్లస్, వన్‌ప్లస్ 3టీ, మోటో జీ4 ప్లే, మోటో ఎక్స్‌ఫోర్స్ వంటి బ్రాండెడ్ క్వాలిటీ ఫోన్‌లు ఈ సేల్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

రెడ్మీ నోట్ 3, మోటో జీ4 ప్లస్
అమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్‌లో భాగంగా షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్ రూ.8,999కే అందుబాటులో ఉంటుంది. మరో డీల్‌లో భాగంగా మోటో జీ4 ప్లస్ 16జీబి వేరియంట్‌ను రూ.11,499కే అమెజాన్ ఆఫర్ చేయనుంది. 32జీబి వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.

మోటో ఎక్స్ ఫోర్స్, మోటో జీ4 ప్లే
అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా మోటో ఎక్స్ ఫోర్స్ 32జీబి వేరియంట్ పై రూ.5,000 డిస్కౌంట్‌ను అందించనున్నారు. ధర తగ్గింపు నేపథ్యంలో ఈ ఫోన్‌ను రూ.21,999కే సొంతం చేసకునే అవకాశం మీకు లభిస్తుంది. మరోవైపు మోటో జీ4 ప్లే స్మార్ట్‌ఫోన్ పై రూ.1000 తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తుంది. ధర తగ్గింపు నేపథ్యంలో ఈ ఫోన్‌ను రూ.7,999కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

లెనోవో జుక్ జెడ్1 పై రూ.2,500 తగ్గింపు
లెనోవో జుక్ జెడ్1 ఫోన్ పై రూ.2,500 డిస్కౌంట్‌ను అమెజాన్ అందించనుంది. ధర తగ్గింపు నేపథ్యంలో జుక్ జెడ్1 10,999కే మీ సొంతమవుతుంది.

OnePlus 3T
ఈ సేల్‌ను పురస్కరించుకుని OnePlus 3T ఫోన్ పై అమెజాన్ ఇండియా ఏ విధమైన ధర తగ్గింపును ప్రకటించనప్పటికి ఎక్స్‌ఛేంజ్ విలువను రూ.2,000కు పెంచింది.

Lenovo Phab 2 Plus
ఇదే సేల్‌లో భాగంగా Lenovo Phab 2 Plus రూ.1000 డిస్కౌంట్‌తో ట్రేడ్ అవుతుంది. ధర తగ్గింపు నేపథ్యంలో Phab 2 Plus విత్ జేబీఎల్ హెడ్‌ఫోన్స్‌ను రూ.13,999కే మీ సొంతమవుతుంది. ఇదే సేల్‌లో భాగంగా ఐఫోన్ 5 ఎస్ 16జీబి వర్షన్‌ను రూ.15,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.18749గా ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్లు..
ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా అమెజాన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రూ.4,999 అంతకన్నా ఎక్కువ మొత్తంలో కొనుగోళ్ల పై స్టేట్ బ్యాంక్ ఇండియా తన యూజర్లకు 15% వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ యాప్ ద్వారా ఈ కోనుగోలు చేసిన వారికి 15% వరకు, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోళ్లు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది.

Amazon Pay క్యాష్‌బ్యాక్ ఆఫర్స్
అమెజాన్ ఈ-వాలెట్ సర్వీస్ అయిన ‘అమెజాన్ పే' (Amazon Pay), ఈ సేల్‌లో భాగంగా రూ.250 నుంచి రూ.4,999 విలువ చేసే ఆర్డర్స్ పై 15% వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది.

మీరు ఫస్ట్ టైమ్ అమెజాన్ ఇండియా యూజర్ అయినట్లయితే..?
అమెజాన్ ఇండియా గ్రేడ్ ఇండియన్ సేల్ 2017లో పాల్గొనదలిచిన వారు అమెజాన్ యాప్ ద్వారా షాపింగ్ చేసినట్లయితే ఎక్కువ డిస్కౌంట్స్ పాటు క్యాష్బ్యాక్ ఆఫర్స్ లభించే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ టైమ్ అమెజాన్ ఇండియా యూజర్ అయినట్లయితే ముందుగా అమెజాన్ సైట్‌లో రిజిస్టర్ అయి మీ షిప్పింగ్ అడ్రస్‌ను ఫిల్ చేయవల్సి ఉంటుంది. ఈ
సేల్‌లో భాగంగా అమెజాన్ ఆఫర్ చేసే అన్ని ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 30 నిమిషాల ముందు నుంచే అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








