శాంసంగ్ కార్నివాల్, అమెజాన్‌లో రూ.8 వేలు నగదు వెనక్కి, దూసుకొస్తున్న గెలాక్సీ ఎస్9

|

ఈ-కామర్స్ దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ అమెజాన్‌తో శాంసంగ్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా శాంసంగ్ పలు స్మార్ట్‌ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.శాంసంగ్ కార్నివాల్ ప్రత్యేక సేల్‌లో భాగంగా వినియోగదారులుశాంసంగ్ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఈ సేల్‌లో వినియోగదారులకు గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎ8 ప్లస్, ఆన్7 ప్రైమ్ (64 జీబీ), ఆన్7 ప్రైమ్ ఫోన్లపై వరుసగా రూ.8వేలు, రూ.4వేలు, రూ.2వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే యూజర్లు అమెజాన్ పే వాలెట్‌లో నగదు జమ చేసి కొంటేనే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. దీంతో ఫోన్ డెలివరీ అయిన 10 రోజుల్లోగా క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. అలాగే ఈ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక పేటీఎం మాల్‌లోనూ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లపై కస్టమర్లకు రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తున్నది. నోట్8పై రూ.8వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ కూడా ఈ నెల 8వ తేదీతో ముగియనుంది.కాగా శాంసంగ్ ఎస్9 ఫోన్లు ఇండియాలో సందడి చేసేందుకు సర్వం సిద్ధం అయింది.

 

ట్యాబ్లెట్ కొనాలనుంటున్నారా, అయితే మీ కోసమే ఈ న్యూస్..ట్యాబ్లెట్ కొనాలనుంటున్నారా, అయితే మీ కోసమే ఈ న్యూస్..

మార్చి7న జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో..

మార్చి7న జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో..

శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లను భారత్‌లో అఫిషియల్‌గా లాంచ్ చేయనున్నారు. ఢిల్లీలో మార్చి7న జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఈ విషయమై ఇప్పటికే శాంసంగ్ సంస్థ మీడియాకు ఆహ్వానాలను పంపింది.

64/128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు

64/128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లకు గాను 64/128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు విడుదల కాగా భారత్‌లో మాత్రం కేవలం 64/256 జీబీ వేరియెంట్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిసింది. ఇక గెలాక్సీ ఎస్9 ప్రారంభ ధర మన దగ్గర రూ.57,900 ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఎస్9 ప్లస్‌ను రూ.64,900 ప్రారంభ ధరకు విక్రయించనున్నట్లు తెలిసింది.

భారత్‌లో ప్రీ ఆర్డర్లు ప్రారంభం
 

భారత్‌లో ప్రీ ఆర్డర్లు ప్రారంభం

ఈ ఫోన్లకు ఇప్పటికే భారత్‌లో ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో రూ.2వేలు చెల్లించి బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మార్చి 16 నుంచి ఈ ఫోన్లకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఫోన్లను డెలివరీ తీసుకునే సమయంలో..

ఫోన్లను డెలివరీ తీసుకునే సమయంలో..

కాగా ఫోన్లను డెలివరీ తీసుకునే సమయంలో చెల్లించే మొత్తం నుంచి అంతకు ముందు చెల్లించిన రూ.2వేలను మినహాయించుకుంటారు. దీంతో మిగిలిన మొత్తాన్ని వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌

రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌ స్టీరియో సౌండ్‌ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్‌ ఎక్స్‌ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది.కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్‌9 ప్లస్‌లో ద్వంద్వ రియర్‌ కెమెరాలను, అలాగే ఫేస్‌ రికగ్నిషన్‌, ఎఆర్‌ (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon India's Samsung Carnival Offers Up to Rs. 8,000 Cashback as Amazon Pay on Select Samsung Devices More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X