ఆన్‌లైన్ షాపర్ల కోసం ఆమెజాన్ యాప్‌స్టోర్

Posted By:

ఇండియాలోని ఆన్‌లైన్ షాపర్ల కోసం ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం ఆమెజాన్ అప్‌గ్రేడెడ్ వర్షన్ ఆండ్రాయిడ్ షాపింగ్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసింది. ఆమెజాన్ విడుదల చేసిన ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా షాపర్లు తమ  ఆన్‍‌లైన్ కొనుగోళ్లను వేగవంతంగా, సౌకర్యవంతంగా ఇంకా సురక్షితంగా సాగించవచ్చు.

ఆన్‌లైన్ షాపర్ల కోసం ఆమెజాన్ యాప్‌స్టోర్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కొత్తగా ఆమెజాన్‌లో సభ్యత్వం తీసుకోవాలనుకునే షాపర్లు ఈ యాప్ ద్వారా కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. పాత కస్టమర్లు తమ Amazon.in అకౌంట్‌కు సంబంధించిన యూజర్‌నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకుని ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ యాప్‌స్టోర్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని ఆమెజాన్.ఇన్, ఆమెజాన్.కామ్, ఆమెజాన్.కో. యూకే ఇంకా ఆమెజాన్ అంతర్జాతీయ స్టోర్ వెబ్‌సైట్‌లకు సంబంధించి యాక్సిస్ పొందవచ్చు. గూగుల్ ప్లే‌స్టోర్ లో నిక్షిప్తం చేయబడిన ఆమెజాన్ యాప్ స్టోర్ అప్లికేషన్ ను ఉపయోగించుకుని ఆండ్రాయిడ్ యూజర్లు ఆమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతులను నిరంతరాయంగా ఆస్వాదించవచ్చు.

లింక్ అడ్రస్: Amazon Appstore 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot