త్వరపడండి, నోకియా 6పై భారీ డిస్కౌంట్
మీరు నోకియా అభిమానులా..నోకియా 6 ధర తగ్గుతుందని ఎదురుచూస్తున్నారా..
మీరు నోకియా అభిమానులా..నోకియా 6 ధర తగ్గుతుందని ఎదురుచూస్తున్నారా..అయితే మీ కోసం ఈ ఫోన్ రూ. 3 వేలు తగ్గి మార్కెట్లో మీకోసం ఎదురుచూస్తోంది. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2,200 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది.

రూ. 14,999కే
32జీబీ అయిన నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధర 17,199 రూపాయలు. కాగా 13 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 14,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్ పే ద్వారా..
అమెజాన్ పే ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. అదేవిధంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,601 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే
5.5 అంగుళాల ఫుల్-హెచ్‌డీ టచ్-స్క్రీన్ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
16 ఎంపీ పీడీఏఎఫ్ ప్రైమరీ కెమెరా
8 ఎంపీ ఏఎఫ్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా-కోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్
మేట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ రంగు



Click it and Unblock the Notifications