ధర రూ.10,749 కే 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో సేల్..!
రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ ను (Realme Narzo 70x 5G Smartphone) ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ రెయిన్ వాటర్ టచ్, ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్ లను కలిగి ఉంది. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల వివరాలు.
మూడు స్టోరేజీ వేరియంట్ లు :
భారత్ మార్కెట్ లో రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వంటి మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.12,499 గా ఉండేది.

ప్రస్తుతం అమెజాన్ లో (Amazon Discount on Realme Narzo 70x Smartphone) రూ.10,749 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు RBL కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ ల వివరాలు :
రియల్‌మి నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ 6.72 FHD+ (1080*2400 పిక్సల్స్) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.
రియల్‌మి స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.
50MP ప్రైమరీ కెమెరా :
రియల్‌మి నార్జో 70x 5G హ్యాండ్ సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ ను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది.
రెయిన్ వాటర్ టచ్, ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్ లు :
ఈ హ్యాండ్‌సెట్ రెయిన్ వాటర్ టచ్, ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్ లను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తోంది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ ను పూర్తి చేస్తుందని రియల్‌మి చెబుతోంది. IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications







