అమెజాన్ సేల్.. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్, 50MP కెమెరా Vivo స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్..!
భారత్ మార్కెట్‌లో ఇటీవల వరుస పండుగల సందర్భంగా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ధరలను ఆయా సంస్థలు సహా ఇ-కామర్స్ సంస్థలు ప్రకటించాయి. అయితే పండుగ సీజర్ ముగిసిన తర్వాత కూడా అనేక స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో గత నెలలో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y300 Plus Smartphone) విడుదల చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో (Amazon) ఈ హ్యాండ్‌సెట్ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ వివో Y300 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 8GB ర్యామ్ ను కలిగి ఉంది. దీంతోపాటు 50MP కెమెరా సహా 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. రెండు కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.23999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1750 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ వివిధ కార్డులపై వేర్వేరుగా ఉంది. HDFC, Yes బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల కార్డుల EMI, సాధారణ లావాదేవీలపై ఈ డిస్కౌంట్‌లను పొందవచ్చు.
వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2400*1080 పిక్సల్స్ రిజల్యూషన్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. మరియు 6nm స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీలో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా వివో Y300 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా + 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ కెమెరా నైట్, పొర్ట్రెయిట్, డ్యూయల్ వ్యూ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. అదే వెనుక కెమెరా Pano, నైట్, పొర్ట్రెయిట్, టైం ల్యాప్స్, డ్యూయల్ వ్యూ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
ఈ వివో హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 183 గ్రాముల బరువు ఉంది. డ్యూయల్ నానో సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు Wi-Fi, బ్లూటూత్ 5.1, OTG వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








